Skip to content

నా కింగ్డమ్ కు సందీప్ వంగా చీఫ్ ఆర్కిటెక్ట్, గౌతమ్ తిన్ననూరి కొత్త ఆర్కిటెక్ట్ – హీరో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ క్రేజీ పాన్ ఇండియా మూవీ "కింగ్డమ్" ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. కింగ్డమ్ బాయ్స్ పేరుతో సందీప్ వంగా, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ప్రమోషన్ కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ ను షేర్ చేస్తూ 'నా కింగ్డమ్ ను రూపొందించిన చీఫ్ ఆర్కిటెక్ట్ ఒకవైపు, దాన్ని మరింతగా పెంచుకుంటూ వెళ్తున్న కొత్త ఆర్కిటెక్ట్ మరోవైపు ఉన్నారు..' అంటూ విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు. సందీప్ వంగా డైరెక్షన్ లో విజయ్ చేసిన ఆర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో తెలుసు. అలాగే గౌతమ్ డైరెక్షన్…

Read more

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

- 'హరి హర వీరమల్లు' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం - సంచలన వసూళ్లతో దూసుకుపోతున్న చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన 'హరి హర వీరమల్లు' చిత్రం భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగుపెట్టింది. జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ధర్మం కోసం పోరాడిన వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ ఒదిగిపోయిన తీరుకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నటీనటుల అద్భుత నటన, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ, సంగీతం ఇలా ప్రతి విభాగం యొక్క పనితీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. 'హరి హర వీరమల్లు' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందుతూ.. షో షోకి వసూళ్లను పెంచుకుంటోంది. ఈ…

Read more

సినిమా అనేది వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలి.. ‘హరి హర వీరమల్లు’ గొప్ప చిత్రం : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. జూలై 24న విడుదలవుతోన్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. జూలై…

Read more

‘భద్రకాళి’ ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: విజయ్ ఆంటోనీ

తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న భద్రకాళి కోపం, తిరుగుబాటు, కరప్ట్ వ్యవస్థను తుడిచిపెట్టేయాలనే ఫైర్‌తో నిండిన కథతో రూపొందుతుంది. ఇంటెన్స్ కథనం, హై-ఆక్టేన్ యాక్షన్‌తో ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో మార్గన్ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను కూడా…

Read more

#Mega 157 మూడవ షెడ్యూల్ కేరళలో పూర్తి

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ #Mega157 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. తాజాగా యూనిట్ కేరళలో మూడవ షెడ్యూల్‌ పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో బ్యూటీఫుల్ సాంగ్ తో పాటు కీలకమైన టాకీ పోర్షన్స్ ని షూట్ చేశారు. సాంగ్, సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. మూడవ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రైవేట్ జెట్ ముందు నిలబడి చిరునవ్వుతో కనిపించిన ఫోటోని మేకర్స్ షేర్ చేశారు. ఇటీవల రిలీజ్…

Read more

సూర్య ‘కరుప్పు’ టీజర్ రిలీజ్

సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ #సూర్య45 కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది. సూర్య ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 'కరుప్పు' ఫస్ట్ లుక్ టీజర్‌ సూర్య బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్‌కి ఇది డబుల్ ట్రీట్‌ అయింది. టీజర్ ఓ మాస్ పండుగలా ఉంటుంది. సూర్య పవర్‌ఫుల్…

Read more

యథార్థ ఘటనలతో రూపొందిన లవ్‌స్టోరీ ‘ఉసురే’ అందరి హృదయాలను హత్తుకుంటుంది: సీనియర్‌ హీరోయిన్‌ రాశి

యదార్థ సంఘటనలతో, సమాజంలో జరిగిన వాస్తవ కథను తెరపై ఆసక్తికరంగా చూపిస్తే ఆ చిత్రాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాయి. ఇప్పుడు ఈ కోవలోనే యదార్థ సంఘటనలతో రూపొందిన ఓ వైవిధ్యమైన గ్రామీణ ప్రేమకథగా 'ఉసురే' ఆగస్టు 1న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టీజయ్‌ అరుణాసలం, జననీ కునశీలన్‌ హీరో, హీరోయిన్స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి నవీన్‌ డి.గోపాల్‌ దర్శకుడు. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్‌ సమర్పణలో బకియా లక్ష్మీ టాకీస్‌ పతాకంపై మౌళి ఎం రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 1న విడుదల చేస్తున్నారు మేకర్స్‌. సీనియర్‌ హీరోయిన్‌ రాశి ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. కాగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు…

Read more

ఉన్ని ముకుందన్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్

డైరెక్టర్ బర్త్‌డే స్పెషల్‌గా గ్రాండ్ అనౌన్స్‌మెంట్ సినీ ఇండస్ట్రీలో బిగ్ అనౌన్స్‌మెంట్. లెజెండరీ డైరెక్టర్ జోషీ ఓ హై-ఒక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ కి మెగాఫోన్ పట్టేందుకు సిద్ధం అయ్యారు. ఉన్ని ముకుందన్ ఫిలింస్ (UMF) & ఐన్స్టిన్ మీడియా బ్యానర్లపై ఈ సినిమా రాబోతుంది. డైరెక్టర్ జోషీ పుట్టినరోజునే ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్లు తర తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఇప్పుడు ఆ అనుభవంతో, ఈ తరం స్టోరీ టెల్లింగ్ పవర్‌తో, ఒక భారీ యాక్షన్ మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న ‘మెప్పడియాన్’ తర్వాత వంద కోట్ల గ్రాస్ కలెక్షన్‌తో దూసుకెళ్లిన ‘మార్కో’ వంటి సినిమాలతో UMF స్టాండర్డ్‌ను నెస్ట్ లెవల్ కి తీసుకెళ్లింది…

Read more

“గుర్రం పాపిరెడ్డి” సినిమా నుంచి యోగిబాబు పోస్టర్ రిలీజ్

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో "గుర్రం పాపిరెడ్డి" సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు "గుర్రం పాపిరెడ్డి" సినిమా నుంచి ప్రముఖ నటుడు యోగిబాబుకు బర్త్ డే విశెస్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో యోగిబాబు ఉడ్రాజు అనే పాత్రలో సందడి చేయబోతున్నారు. ఆయన పర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. పర్పెక్ట్…

Read more

‘వార్ 2’ 25న ట్రైలర్ రిలీజ్

#War 2 మూవీకి సంబందించి 25వ నెంబర్‌కి ఓ ప్రత్యేకత ఉంది. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు గొప్ప స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లను ఒకే సినిమాలో నటింపజేసే అపూర్వ అవకాశాన్ని నిర్మాత ఆదిత్య చోప్రా సాధించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తోన్న ప్రెస్టీజియస్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న WAR 2ను అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ ఈ సంవత్సరం తమ సినీ ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారన్నది ఒక అద్భుతమైన విషయం. ఇది యాదృచ్చికంగా జరిగినప్పటికీ ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా WAR 2 ట్రైలర్‌ను జూలై…

Read more