ఉన్ని ముకుందన్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్
డైరెక్టర్ బర్త్‌డే స్పెషల్‌గా గ్రాండ్ అనౌన్స్‌మెంట్ సినీ ఇండస్ట్రీలో బిగ్ అనౌన్స్‌మెంట్. లెజెండరీ డైరెక్టర్ జోషీ ఓ హై-ఒక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ కి మెగాఫోన్ పట్టేందుకు సిద్ధం అయ్యారు. ఉన్ని ముకుందన్ ఫిలింస్ (UMF) & ఐన్స్టిన్ మీడియా బ్యానర్లపై ఈ సినిమా రాబోతుంది. డైరెక్టర్ జోషీ పుట్టినరోజునే ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్లు తర తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఇప్పుడు ఆ అనుభవంతో, ఈ తరం స్టోరీ టెల్లింగ్ పవర్‌తో, ఒక భారీ యాక్షన్ మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న ‘మెప్పడియాన్’ తర్వాత వంద కోట్ల గ్రాస్ కలెక్షన్‌తో దూసుకెళ్లిన ‘మార్కో’ వంటి సినిమాలతో UMF స్టాండర్డ్‌ను నెస్ట్ లెవల్ కి తీసుకెళ్లింది…