Skip to content

సినీ పరిశ్రమలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్

సినీ పరిశ్రమలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ Telugu News
సినీ పరిశ్రమలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ Telugu News

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ స్టార్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘స్లమ్ డాగ్’ షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం అన్ని భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ‘33 టెంపుల్ రోడ్’ అనే గ్రిప్పింగ్ ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, జెబి మోహన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బద్రీ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పూరి జగన్నాథ్, ఆ సినిమా విడుదలై 26 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి తన దర్శకుడిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు.

“పూరి గారి ప్రయాణం అద్భుతం..
సినిమా రంగంలో 26 సంవత్సరాలు అంటే కేవలం మైలురాయి కాదు… ధైర్యం, నమ్మకం, భయంలేని ఆలోచనలతో నిర్మించిన ఒక లెగసీ.
డియర్ పూరి సర్, #స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్ చిత్రంలో మీతో పని చేయడం నాకు ఎంతో ఆనందం.
నటులుగా మేము ఎప్పుడూ మమ్మల్ని నమ్మి, మా కంఫర్ట్ జోన్ దాటి తీసుకెళ్లే దర్శకులను కోరుకుంటాం… మీరు అది ఎంతో అద్భుతంగా చేస్తారు.

ఈ సినిమా మాలో ప్రతి ఒక్కరికీ చాలా ప్రత్యేకంగా గుర్తుండిపోతుందని నమ్ముతున్నాను.
మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, మరెన్నో ప్రభావవంతమైన కథలు చెప్పాలని కోరుకుంటున్నాను”

ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త నటిస్తుండగా, టబు, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బ్రహ్మాజీ, వీవీటీవీ గణేష్ ముఖ్య పాత్రలు నటిస్తున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల కోసం ఇచ్చిన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లతో ప్రసిద్ధి చెందిన ఆయన, ఈ చిత్రానికి కూడా పవర్ ఫుల్ సంగీతాన్ని అందిస్తున్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతున్న ‘స్లమ్ డాగ్’కు తమిళనాడు ఎన్నికల తర్వాత ప్రమోషన్స్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

తారాగణం: విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, దునియా విజయ్ కుమార్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, JB నారాయణరావు కొండ్రోళ్ల
సమర్పణ: ఛార్మీ కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా