Skip to content

‘శ్రీమహా విష్ణు’ ఫస్ట్ లుక్ రిలీజ్

‘శ్రీమహా విష్ణు’ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

‘సిద్ధార్థ్ రాయ్’ చిత్రంలో హీరోగా అరంగేట్రం చేసి ఆకట్టుకున్న బాలనటుడు, హీరో దీపక్ సరోజ్, ఇప్పుడు హరి హరన్ గోధగాని దర్శకత్వంలో తన రెండవ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హరి తన్నిరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపక్ సరోజ్ సరసన అనైరా గుప్తా, దీప్సిక నటిస్తున్నారు.

పవిత్రమైన శ్రీరామ నవమి సందర్భంగా, చిత్ర బృందం టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘శ్రీమహా విష్ణు’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ రొమాంటిక్ ఫస్ట్ లుక్, హీరో హీరోయిన్ మధ్య ఒక లవ్లీ మూమెంట్ ని ప్రజెంట్ చేస్తోంది. సున్నితమైన ఆయిల్ పెయింటింగ్ స్టయిల్ లో అందంగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ‘ప్రతి హృదయానికీ ఒక కథ ఉంటుంది’ అనే ట్యాగ్‌లైన్ ఒక సున్నితమైన ప్రేమకథ ఉందని సూచిస్తుంది.

‘శ్రీమహా విష్ణు’ ప్రేమ, బాధ్యత, ఆత్మశోధన వంటి అంశాలను ప్రజెంట్ చేసే ఒక మంచి ప్రేమకథగా రూపొందించబడింది. దీపక్ సరోజ్ ఒక యువ చిత్రకారుడి పాత్రను పోషిస్తున్నాడు, ఈ పాత్ర ఎమోషనల్ డెప్త్ తో సరికొత్తగా ఉండబోతుంది.

అత్యున్నత నిర్మాణ, సాంకేతిక ప్రమాణాలతో రూపొందించబడిన ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది, పోస్ట్-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ప్రముఖ నటులు నటించగా, టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు

దర్శకుడు హరి హరన్ గోధగాని మాట్లాడుతూ.. ఈ సినిమా నేటి ప్రేక్షకులు, ముఖ్యంగా యువత ఎక్కువగా కనెక్ట్ అయ్యే అన్ని అంశాలతో రూపొందింది. ప్రేమను వేడుకలా చూపిస్తూ, కుటుంబ విలువల ప్రాముఖ్యతను కూడా సున్నితంగా తెలియజేస్తుంది”

ఈ చిత్రానికి సంగీతాన్ని అనూప్ రూబెన్స్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని సురేష్ రగుతు నిర్వహిస్తున్నారు. క్రాంతి ప్రియుమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా, శ్రీ వర ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

ఈ ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌ను మేకర్స్ మే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన రావడంతో, సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.

తారాగణం: దీపక్ సరోజ్, అనైరా గుప్తా, దీప్సిక, రఘుబాబు, సుదర్శన్, రచ్చ రవి, జబర్దస్త్ ఆది, పుంజు రాజు, శశి, లిఖిత, దేవి ప్రసాద్, రవివర్మ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హరి హరన్ గోధగాని
నిర్మాత: శ్రీ హరి తన్నీరు
బ్యానర్: శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్స్
DOP: సురేష్ రగుతు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటర్: శ్రీ వర
ఆర్ట్: క్రాంతి ప్రియుమ్
సాహిత్యం: కెకె, శ్రీమణి
యాక్షన్: అంజి
కొరియోగ్రాఫర్‌లు: రఘు, హరి కిరణ్, సునీల్, సన్నీ
PRO: వంశీ-శేఖర్
ప్రొడక్షన్ మేనేజర్: ఎం పరమేష్ కుమార్

See also  'తెలుసు కదా' చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.