ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు జాతీయ స్థాయిలో నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ చరిత్ర!
57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి తెలుగు రాజకీయ వెబ్ సిరీస్ తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ‘మయసభ’ సరికొత్త చరిత్ర సృష్టించింది. సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ తెలుగు పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్ 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రతిష్ఠాత్మకమైన బెస్ట్ వెబ్ సిరీస్ (OTT) అవార్డుకు జాతీయ స్థాయిలో నామినేట్ అయింది. 2023లో ఐఎఫ్ఎఫ్ఐలో ఈ అవార్డును ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ నిలిచింది. జాతీయ స్థాయిలో ఈ ఘనత దక్కడం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ప్రముఖ దర్శకుడు దేవా…
