మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాకా’- కదిరి కాళిదాసుగా తన పాత్ర పేరును లీక్ చేసిన మెగాస్టార్
బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచే అప్‌డేట్ వచ్చింది. ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన క్యారెక్టర్ పేరును రివీల్ చేశారు. ‘కాకా’లో చిరంజీవి ‘కదిరి కాళిదాస్’గా కనిపించబోతున్నారు. ఈ పవర్‌ఫుల్ పేరు వినగానే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరుగుతోంది. ‘కాకా’ హై-ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ…
