#NN5 పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభం
వరుసగా మూడు విజయవంతమైన చిత్రాలను అందించిన యంగ్ హీరో నార్నే నితిన్, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. 'జూనియర్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రెడ్డితో ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కోసం జతకట్టారు. #NN5 చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తుండగా, లోహిత ఎన్.కె క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. వివిధ చిత్ర పరిశ్రమలలో భారీ స్థాయి చిత్రాలను నిర్మిస్తూ దేశంలోని అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలలో ఒకటిగా కెవిఎన్ ప్రొడక్షన్స్ గుర్తింపు పొందింది. అద్భుతమైన సినిమాటిక్ అనుభవాలను అందించే తమ మార్క్ ను కొనసాగిస్తూ, ఈ సంస్థ #NN5 చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తోంది. ఇందులో నార్నే నితిన్ సరికొత్తగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో నార్నే…
