Skip to content

డాక్టర్ గా వైద్యం – హీరోగా వినోదం అందించాలన్నదే నా ధ్యేయం!!

డాక్టర్ టర్నెడ్ హీరో పవన్ మహావీర్ ఆగస్టు 7 విడుదలకు సిద్ధమవుతున్న "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి" జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ... ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమకధా చిత్రం "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి". పవన్ మహావీర్ లండన్ లో వైద్య విద్య అభ్యసిస్తూ హీరోగా నటించడం విశేషం. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల…

Read more

కోలాహలంగా కోడి రామకృష్ణ స్మారక పురస్కారాలు

శతాధిక చిత్ర నిర్మాత - భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సారధ్యంలో ఈ ఏడాది కూడా కోడి రామకృష్ణ స్మారక పురస్కారాల ప్రదానోత్సవ వేడుక హైదరాబాద్, ప్రసాద్ లాబ్ ప్రివ్యూ థియేటర్ లో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మురళి మోహన్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, హీరో సుమన్ గారు, ప్రముఖ నిర్మాతలు కేఎస్ రామారావు, ప్రసన్న కుమార్, అశోక్ కుమార్, దామోదర్ ప్రసాద్, మాజీ మంత్రి, నటులు బాబూమోహన్, బాపుబొమ్మ దివ్యవాణి, అంబికా కృష్ణ, వంశీ రామరాజు తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు!! దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తూ... వారి…

Read more

‘యమకింకరుడు’ ట్రైలర్‌ విడుదల చేసిన నిర్మాత కె.ఎస్. రామారావు!

(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర పోషిస్తూ, దర్శకత్వం వహించి నిర్మిస్తున్న వినూత్న చిత్రం ‘యమ కింకరుడు’. తెలుగు సినీ చరిత్రలోనే మొదటిసారిగా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతతో రూపుదిద్దుకున్న చిత్రంగా ఇది చరిత్ర సృష్టించనుంది. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ సుమన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉందంటూ చిత్ర యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ: "తెలుగు ఇండస్ట్రీలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో రామసత్యనారాయణ ఎప్పుడూ ముందుంటారు. AI సాంకేతికతతో తెలుగులో మొదటి సినిమా…

Read more

జీరో బడ్జెట్ లఘు చిత్రం “రీ-వాల్యుయేషన్”

"అమ్ములు, ది గిల్ట్, యాని-'మేల్', డియర్ ఫ్యూచర్ మి" వంటి బ్యాక్ టు బ్యాక్ షార్ట్ ఫిలిమ్స్ తో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ధీరజ అప్పాజీ తాజాగా తెరకెక్కించిన లఘు చిత్రం "రీ-వాల్యుయేషన్" (Re-Valuation). "సెకండ్ ఛాన్స్ ఎట్ లవ్" అనే ట్యాగ్ లైన్ తో జీరో బడ్జెట్ లో తెరకెక్కించిన, 12 నిమిషాల లోపు నిడివి కలిగిన ఈ లఘు చిత్రంలో సురేష్ జగన్నాధం - అనుశ్రీ జంటగా నటించారు. తను రూపొందించే ప్రతి చిత్రంలోనూ కచ్చితంగా నటించే ధీరజ అప్పాజీ... 'రీ-వాల్యుయేషన్"లో టైటిల్ జస్టిఫై చేసే అతిథి పాత్ర పోషించారు!! తెరపై కనిపించకుండా... ఫోన్ లో వినిపించే పాత్రలకు లక్ష్మీ పెండ్యాల,…

Read more

జులై 31 విడుదలకు ముస్తాబవుతున్న “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”

జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ... ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమకధా చిత్రం "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి". శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 31 విడుదలకు సిద్ధమవుతోంది!! నిర్మాత జి. శైలజరెడ్డి మాట్లాడుతూ... "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి" చిత్రం ఒకటికి రెండుసార్లు చూడాలనిపించేలా తెరకెక్కింది. అందుకు సహకరించిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు అందరికీ పేరుపేరునా…

Read more

‘లూయిస్ వ్యూట్టన్’లో రాజ్ దాసిరెడ్డి సందడి!!

మారుతి "భద్రం బి కేర్ ఫుల్" ఫేమ్ రాజ్ దాసిరెడ్డి... ప్రపంచప్రఖ్యాత ఫ్యాషన్ హౌస్ "లూయిస్ వ్యూట్టన్'లో సందడి చేశారు. హ్యాండ్ బ్యాగ్స్, షూస్ మొదలుకుని జ్యువెలరీ వరకు పలు రకాల అలంకార ఉత్పత్తులకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన "లూయిస్ వ్యూట్టన్', హైదరాబాద్ స్టోర్ ను సందర్శించడం తనకెంతో సంతోషానించ్చిందని దాసిరెడ్డి పేర్కొన్నారు. 172 సంవత్సరాల సుదీర్ఘ ఘన చరిత్ర కలిగిన "లూయిస్ వ్యూట్టన్' అనేక పర్యాయాలు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఫ్యాషన్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది. "లూయిస్ వ్యూట్టన్' ప్రోడక్ట్ ధరించడాన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సైతం గర్వంగా, ప్రత్యేకంగా ఫీలవుతుంటారు. రాజ్ దాసిరెడ్డి తదుపరి చిత్రం త్వరలో అనౌన్స్ కాకుంది. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనుంది!!

Read more
“అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”  టీజర్ రిలీజ్ Telugu News

“అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి” టీజర్ రిలీజ్

జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ... ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వినూత్న ప్రేమకధా చిత్రం "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి". శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత ఘనంగా జరిగింది!! ఆంధ్రప్రదేశ్ ఫిలిం డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, ఫెడరేషన్ అధ్యక్షులు…

Read more
వైభవంగా దాసరి లెజెండ్రీ అవార్డ్స్ పంపిణీ Telugu News

వైభవంగా దాసరి లెజెండ్రీ అవార్డ్స్ పంపిణీ

ప్రఖ్యాత దర్శకులు దాసరి నారాయణరావు మరణానంతరం ఆయన పేరిట ప్రతి ఏటా ఘనంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తున్న ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ ఏడాది కూడా ఆయన 79వ జయంతిని పురస్కరించుకొని "దాసరి లెజెండరీ అవార్డ్స్" పేరిట అవార్డ్స్ ఫంక్షన్ అత్యంత ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ వేడుకకు ప్రముఖ నటులు - మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్, సీనియర్ నటీమణి రోజారమణి, సీనియర్ హీరో సుమన్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, దూరదర్శన్ డైరెక్టర్ శ్రీమతి కామేశ్వరి, వంశీ రామరాజు, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు!! 2025…

Read more
“గద్దర్ అవార్డ్” ఇచ్చిన ఉత్తేజంతో రెండో చిత్రం త్వరలో ప్రారంభం!! Telugu News

“గద్దర్ అవార్డ్” ఇచ్చిన ఉత్తేజంతో రెండో చిత్రం త్వరలో ప్రారంభం!!

-"వనజీవి రామయ్య" నిర్మాత బూసం రవీంద్రనాధ్ "మనం చెట్లను కాపాడితే... చెట్లు మనల్ని కాపాడతాయి" అనే సిద్దాంతంతో చెట్లు నాటడానికే తన జీవితాన్ని అంకితం చేసి, "చెట్ల రామయ్య" అలియాస్ "వనజీవి రామయ్య"గా తన జన్మను ధన్యం చేసుకుని, భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక "పద్మశ్రీ" పురస్కారం పొందిన దరిపల్లి రామయ్య జీవితానికి "వనజీవి రామయ్య" పేరుతో దృశ్యరూపం ఇచ్చారు నూతన నిర్మాత బూసం రవీంద్రనాధ్. "వృక్షో రక్షతి రక్షిత" అనే ట్యాగ్ లైన్ తో నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో బి. ఆర్. మూవీస్ బ్యానర్ పై రవీంద్రనాధ్ నిర్మించిన ఈ 40 నిమిషాల నిడివి కలిగిన లఘు చిత్రం... షార్ట్ ఫిలిమ్స్ కేటగిరీలో ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్…

Read more
“ఒక్క చాన్స్ ప్లీజ్ ” అంటున్న పల్లవి గౌడ్ Telugu News

“ఒక్క చాన్స్ ప్లీజ్ ” అంటున్న పల్లవి గౌడ్

"చిన్నప్పుడు ఒకసారి వినాయక చవితి ఉత్సవం సందర్భంగా స్టేజి ఎక్కి డాన్స్ చేశాను. అప్పుడు వినిపించిన ఈలలు చప్పట్లు ఇప్పటికీ నాకు గుర్తు. ఆ క్షణమే... ఎప్పటికైనా వెండి తెరపై నన్ను నేను చూసుకోవాలని ఆశపడ్డాను. ఒకసారి వచ్చిన ఒక మంచి ఛాన్స్ చేజేతులారా జారవిడుచుకున్నాను. కానీ ఇప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్నాను" అంటుంది పల్లవి గౌడ్. కుటుంబ బాధ్యతల కారణంగా తనలోని కళాతృష్ణను ఇన్నాళ్లు తనలోనే అణచివేసుకున్న ఈ "అచ్చ తెలుగు తెలంగాణ ఆడపడుచు" ఇప్పుడిప్పుడు రీల్స్, ఫోక్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ తో తన ప్రతిభను చాటుకుంటూ సినిమా రంగం వైపు స్థిరంగా అడుగులు వేస్తోంది. ప్రముఖ దర్శకుడు కర్రి బాలాజీ రిఫరెన్స్ తో త్వరలో విడుదల కానున్న…

Read more