Skip to content

ఇకపై నటనపైనే దృష్టి- కె. దివ్యవాణి

సినిమా రంగంలో "బాపు బొమ్మ"గా... టివి రంగంలో "పుత్తడిబొమ్మ"గా సుప్రసిద్ధురాలైన దివ్యవాణి... రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. మరోవైపు "పే బ్యాక్ టు సొసైటీ" అనే నినాదం స్పూర్తితో సమాజానికి తన వంతు సేవా కార్యక్రమాలు విరివిగా చేస్తున్నారు. అయితే ఇకపై రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ సినిమా రంగంపై దృష్టి సారించాలని దృఢ నిశ్చయం తీసుకున్నానని చెబుతున్నారు! "పెళ్ళి పుస్తకం, ఎదురింటి మొగుడు - పక్కింటి పెళ్ళాం" వంటి చిరస్మరణీయ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిర స్థానం సంపాదించుకున్న దివ్యవాణి... "పుత్తడి బొమ్మ" టివి సీరియల్ తోనూ ఉర్రూతలూగించారు. అంతేకాదు... కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించి... అక్కడి ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన ఈ అందాల భామ... కన్నడ అనర్గళంగా మాట్లాడతారు. ఈ…

Read more

షూటింగ్ పూర్తి చేసుకున్న జరీనా వహాద్ ‘తు బేఖబర్’

వెటరన్ నటి జరీనా వహాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సోషల్ డ్రామా చిత్రం ‘తు బేఖబర్’ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. భారతీయ సినీ రంగంలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న జరీనా వహాబ్, ఇటీవల ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల్లోనూ నటించారు. దీపక్ బల్‌దేవ్ ఠాకూర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని "గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ" బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. డి. దినకర్ నాయుడు సహ నిర్మాత. సమకాలీన సామాజిక సమస్యలను స్పృశించే హృద్యమైన కథాంశంతో, ప్రస్తుత సమాజానికి అవసరమైన సందేశాన్ని అందించే చిత్రంగా ‘తు బేఖబర్’ను మేకర్స్ అభివర్ణిస్తున్నారు. జరీనా వహాబ్‌తో పాటు మధు నంబియార్, పవన్ కుమార్, హేమ…

Read more

“ప్రతిరూపం” తెలుగులోనూ పెద్ద విజయం సాధించాలి!!

ప్రి-రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ హీరోయిన్ కె.దివ్యవాణి చౌదరి శ్రీ వినాయక వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై ఎస్. నరేష్ దర్శకత్వంలో శ్రీమతి బి. కళావతి కన్నడలో నిర్మించిన చిత్రం "ఇనియన్ ఆత్మ". కన్నడలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో "ప్రతిరూపం" పేరుతో అనువదించి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రి-రిలీజ్ వేడుకకు ప్రముఖ నటీమణి కె.దివ్యవాణి చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి గిడుగు కాంతికృష్ణ, ప్రముఖ బిజినెస్ కో-ఆర్డినేటర్ నారాయణ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు చిత్రబృందం మొత్తం బెంగుళూరు నుంచి తరలివచ్చింది. చిత్ర నిర్మాత…

Read more

న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2026లో తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి సందడి!

కలలు, పట్టుదల, భారతీయ స్ఫూర్తికి ప్రతీకగా అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై తెలుగు మూలాలున్న రాజ్ దాసిరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2025లో 97వ ఆస్కార్ వేడుకలకు ఆహ్వానం అందుకుని అంతర్జాతీయ మీడియా, అభిమానుల దృష్టిని ఆకర్షించిన రాజ్ దాసిరెడ్డి… తాజాగా న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2026లో హైప్రొఫైల్‌ ప్రదర్శనతో మరోసారి వార్తల్లో నిలిచారు. తెలుగు నేల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు సాగుతున్న ఆయన ప్రయాణం సోషల్ మీడియాలోనూ విశేష చర్చకు దారితీస్తోంది. అమెరికాలో విద్యాభ్యాసం చేయడంతోపాటు... అక్కడే ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ తీసుకుని, మోడలింగ్ నుంచి నటనలోకి ప్రవేశించి, మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన "భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు" చిత్రంతో హీరోగా పరిచయమైన రాజ్ దాసిరెడ్డి నటిస్తున్న ఓ…

Read more

పర్సనల్ అసిస్టెంట్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించిన వినోద్ కుమార్

"కర్తవ్యం మౌన పోరాటం, భారత్ బంద్, పీపుల్స్ ఎన్కౌంటర్, మాగారు, సీతారత్నం గారి అబ్బాయి" వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కథానాయకుడు వినోద్ కుమార్. హీరోగా ఆయనకు ఎంత మంచి పేరు ఉందో... వ్యక్తిగతంగాను అంతే మంచి పేరుంది. తన దగ్గర పనిచేసే సిబ్బంది పట్ల తన అభిమానుల పట్ల ఆయన అపారమైన ప్రేమాభిమానాలు, ఆదరణ కనబరుస్తుంటారు తాజాగా ఆయన చూపిన ఔదార్యం వినోద్ కుమార్ వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది. తాడేపల్లిగూడెంకు చెందిన సతీష్ సుమారు 20 ఏళ్లు వినోద్ కుమార్ దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా, పర్సనల్ టచప్ బాయ్ గా పని చేశాడు. తదనంతర కాలంలో తాడేపల్లిగూడెం వచ్చి స్థిరపడ్డాడు. సెక్యూరిటీ గార్డ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నడంతోపాటు…

Read more

‘మోజు” టైటిల్ ఖరారు

సినిమా నిర్మాణం అంటే ఆయనకు ప్యాషన్ కాదు. ఒక "అబ్సెషన్". అందువల్లే అతి తక్కువ కాలంలో నిర్మాతగా "సెంచరీ" కొట్టి డబుల్ సెంచరీ దిశగా ముందుకు సాగుతున్నారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ఈ క్రమంలో ఈ శతాధిక చిత్ర నిర్మాత మరో చిత్ర నిర్మాణం కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈసందర్భంగా తుమ్మలపల్లి మాట్లాడుతూ..."మా భీమవరం టాకీస్ పతాకంపై 122వ చిత్రంగా సెట్స్ పైకి వెళ్లనున్న చిత్రానికి 'మోజు" అనే టైటిల్ ఖరారు చేశాం. ఈ చిత్రానికి ప్రేరణ మా ఆర్జీవి. ఈమధ్య ఆయన్ని ముంబైలో కలిసినప్పుడు... ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధిస్తున్న "ది అబ్సెషన్" తరహాలో ఓ చిత్రం చేయమని నాకు సూచించారు. మన ఇండియన్ కరెన్సీలో కేవలం 6…

Read more

డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి “దీపక్ బలదేవ్ ఠాకూర్”

"గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ" ద్వారా నటీనటులకు శిక్షణ, సెలబ్రిటీ మేనేజ్మెంట్ లతోపాటు...ప్రొడక్షన్, డైరెక్షన్ లోనూ తనను తాను నిరూపించుకున్న "దీపక్ బలదేవ్ ఠాకూర్" ఇప్పుడు "డిస్ట్రిబ్యూషన్" రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతానికి ప్రధానంగా "ఒరిస్సా, నార్త్ ఇండియా"లపై దృష్టి సారిస్తున్నారు. తెలుగు-తమిళ భాషలతోపాటు హిందీలోనూ విస్తృతమైన పరిచయాలు కలిగిన దీపక్... "ఓటీటీ, శాటిలైట్ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్" కూడా డీల్ చేస్తుంటారు. పాన్ ఇండియా అప్పీల్ కలిగిన సబ్జెక్టులతో... ప్రణాళికాబద్ధంగా ప్రొడక్షన్ చేసే నూతన నిర్మాణ సంస్థలకు బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలతో "టై అప్" చేయించగలిగే సామర్ధ్యం దండిగా కలిగి ఉన్న దీపక్ కు తెలుగులో సినిమా నిర్మాణం చేసిన అనుభవం ఉండడంతోపాటు... హిందీ సినిమాకు దర్శకత్వం వహించిన…

Read more

సంబరంగా నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర “సంత” చిత్ర కళా ప్రదర్శన

విజేతలకు షీల్డ్, శాలువా నగదు బహుమతులతో సత్కారం బహుముఖ ప్రతిభాశాలి నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర "కథ - మాటలు - స్క్రీన్ ప్లే - సంగీతం - దర్శకత్వం"లో తెరకెక్కిన చిత్రం "సంత". "మట్టి మనుషుల ప్రేమకథ" ట్యాగ్ లైన్. సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై బి.ఎస్.జె నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ ఆత్రేయ సహ నిర్మాత. సూర్య భరత్ చంద్ర - శ్రావ్యారావు జంటగా నటించిన ఈ చిత్రంలో కిన్నెర, మధుమణి, ఆలపాటి లక్ష్మీ, ఉదయశ్రీ, స్వపన్ మండల్, ఆర్.ఎస్.నందా, దుర్గేష్, అమరేందర్ మరియు జబర్దస్త్ ఫణి కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న "సంత" చిత్రానికి చిత్రకళా పోటీ నిర్వహించారు. "మీరు చూసిన వారాంతపు…

Read more

పవన్ మహావీర్ పెద్ద హీరో అవుతాడు! – హీరో సుమన్

ఆగస్టు 7 విడుదలకు సిద్ధమవుతున్న "అమ్మా....... నాకు ఆ అబ్బాయి కావాలి" జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ... ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విభిన్న ప్రేమకధా చిత్రం "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి". లండన్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న పవన్ మహావీర్ ఈ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర…

Read more

ఇకనుంచి “నటన” పార్ట్ టైమ్ కాదు ఫుల్ టైమ్!

-"కాకినాడ కళారత్నం" రవి ఆనంద్ చిన్నిబిల్లి పారితోషికం కంటే పాత్రకు- పాత్ర నిడివి కంటే.... పాత్ర ప్రభావానికి ప్రాధాన్యత!! రేలంగి, అంజలీదేవి, సూర్యకాంతం, రావు గోపాలరావు వంటి సాటిలేని మేటి నటీనటుల్ని తెలుగు చిత్ర రంగానికి అందించిన "కాకినాడ" మరో ప్రతిభావంతుడ్ని అందించేందుకు సిద్ధమవుతోంది. నటుడిగా ప్రతిష్టాత్మక "పద్మశ్రీ" పురస్కారాన్ని.... "నటకిరీటి" అన్న ప్రజా పురస్కారాన్ని సొంతం చేసుకున్న రాజేంద్ర ప్రసాద్ వంటి గొప్ప నటుడితో "శభాష్" అనిపించుకున్న ఆ ప్రతిభాశాలి పేరు "రవి ఆనంద్ చిన్నిబిల్లి". థియేటర్ ఆర్టిస్ట్ గా ఎనలేని పేరు గడించుకొని... కుటుంబ బాధ్యతలు దృష్ట్యా ఇప్పటివరకు కాకినాడకే పరిమితమై, అడపా దడపా మాత్రమే సినిమాల్లో మెరుస్తున్న రవి ఆనంద్... ఇకపై పూర్తిస్థాయిలో సినిమా రంగంపై దృష్టి సారించేందుకు…

Read more