హీరో విజయ్ దేవరకొండ 10 ఏళ్ల అద్భుతమైన కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నారు. ఆయన సోలో…
పవన్ మహావీర్ పెద్ద హీరో అవుతాడు! – హీరో సుమన్

ఆగస్టు 7 విడుదలకు సిద్ధమవుతున్న “అమ్మా……. నాకు ఆ అబ్బాయి కావాలి”
జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ… ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విభిన్న ప్రేమకధా చిత్రం “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”. లండన్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న పవన్ మహావీర్ ఈ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ హీరో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి, ఈ చిత్రం గురించి మాట్లాడారు!
సీనియర్ హీరో సుమన్ మాట్లాడుతూ… “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”లో నేను ఒక ముఖ్య పాత్ర పోషించాను. సినిమా చాలా బాగా వచ్చింది. పవన్ మహావీర్ కు ఇది పరిచయచిత్రమంటే నాకే నమ్మబుద్ధి కాలేదు. అలాగే నిర్మాత శైలజ రెడ్డి కూడా పదిపదిహేను సినిమాలు తీసిన అనుభవజ్ఞురాలైన నిర్మాతలా ప్రాజెక్ట్ ను అద్భుతంగా హ్యాండిల్ చేశారు. కోడి రామకృష్ణగారి దర్శకత్వంలో నేను హీరోగా నటించిన పలు చిత్రాలకు కో-డైరెక్టర్ గా పనిచేసిన శివాల ప్రభాకర్ ఈ చిత్రాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దారు. హీరోయిన్లు వర్షిక, సుహాన చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా హీరో పవన్ మహావీర్ కు ఉజ్వలమైన భవిష్యత్ ఉంది. ఈ అబ్బాయి చాలా పెద్ద హీరో అవుతాడు” అన్నారు!!
నిర్మాత జి. శైలజరెడ్డి మాట్లాడుతూ… “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి” అద్భుతంగా వచ్చేందుకు సహకరించిన మా సీనియర్ హీరో సుమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేస్తున్నాం. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం” అని అన్నారు!!
డాక్టర్ టర్నెడ్ హీరో మహావీర్ మాట్లాడుతూ…. “ఈ చిత్రం ఇంత గొప్పగా రావడం కోసం మనసు పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. షూటింగ్ సమయంలో నాకు ఎన్నో విలువైన సూచనలిచ్చిన హీరో సుమన్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. “అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి” చిత్రాన్ని ఆదరించి, మా నుంచి మరిన్ని చిత్రాలు వచ్చేలా ప్రోత్సహించగలరు” అని అన్నారు!!
దర్శకుడు శివాల ప్రభాకర్ ఈచిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాత శైలజ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్లు వర్షిక, సుహానా మాట్లాడుతూ… “శైలజ రెడ్డి గారి నిర్మాణం… ప్రభాకర్ గారి దర్శకత్వంలో సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ వంటి సీనియర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. హీరో పవన్ మహావీర్ అంకితభావం, కష్టపడేతత్వం నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం” అని అన్నారు!
ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: కిషోర్, ఫైట్స్; నందు, కొరియోగ్రఫీ : భాను మాస్టర్ – మొయిన్ మాస్టర్, సంగీతం: సాయి కార్తీక్, ఛాయాగ్రహణం: మహేందర్.ఎం., ఎడిటర్: నందమూరి హరి, కో-డైరెక్టర్: రావుశ్రీ, నిర్మాత: జి. శైలజ రెడ్డి, స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శివాల ప్రభాకర్!!

