Skip to content

ఎన్టీఆర్ లాంచ్ చేసిన దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ ట్రైలర్

దుల్కర్ సల్మాన్ ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ యామ్ గేమ్’ ట్రైలర్ విడుదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భగా సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. ”#ఐయామ్‌గేమ్ ట్రైలర్‌లోని ఆ ఫైరీ వైబ్ నాకు బాగా నచ్చింది. మొదటి నుంచి చివరి వరకు ఎంతో గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది. నా సోదరుడు దుల్కర్ మరో స్పెషల్ మూవీతో వస్తున్నారని నమ్మకం కలిగింది. తనకి మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అతనితో పాటు మొత్తం చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు!” అని ట్వీట్ చేశారు.

ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 20న ఓణం కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్‌ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్, ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందుతోంది.

ఈ చిత్రానికి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాజిర్ బాబా, ఇస్మాయిల్ అబూబక్కర్, బిలాల్ మొయిదు స్క్రీన్‌ప్లే అందించగా, సాజిర్ బాబా, ఆదర్శ్ సుకుమారన్, షబాస్ రషీద్ సంభాషణలు రాశారు.

విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ ఎంటర్‌టైనర్‌ను వాగ్దానం చేస్తోంది. అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠభరితమైన యాక్షన్, హై-ఆక్టేన్ ఛేజ్ సీక్వెన్స్‌లతో ‘ఐ యామ్ గేమ్’, మలయాళ సినీ ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని స్టైలిష్ ఫాంటసీ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. అంతేకాకుండా అభిమానులు ఇంతకుముందెన్నడూ చూడని అల్ట్రా-స్టైలిష్, మాస్ అవతార్‌లో దుల్కర్ సల్మాన్ ఈ ట్రైలర్‌లో కనిపిస్తున్నారు.

దక్షిణ భారతదేశంలోని 100కు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన ‘ఐ యామ్ గేమ్’, ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. పరిశ్రమలోనే అత్యంత భారీ విడుదలల్లో ఒకటిగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందనను అందుకున్నాయి.

ఈ చిత్ర సంగీత హక్కులను జీ మ్యూజిక్ సొంతం చేసుకోగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ట్రైలర్‌లో ఆయన అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు జిమ్షి ఖలీద్ అందించిన విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యాక్షన్ సీక్వెన్స్‌లను అన్బరివ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు.

మెగా బ్లాక్‌బస్టర్ ‘లోకా’ తర్వాత వేఫేరర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న చిత్రం ‘ఐ యామ్ గేమ్’ కావడం విశేషం. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు-దర్శకుడు మిస్కిన్, కాయడు లోహర్, కథిర్, పార్థ్ తివారీ, తమిళ నటి సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

బ్లాక్‌బస్టర్ ‘ఆర్డీఎక్స్’ తర్వాత దర్శకుడు నహాస్ హిదాయత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ‘ఐ యామ్ గేమ్’ మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

దర్శకత్వం: నహాస్ హిదాయత్
సినిమాటోగ్రఫీ: జిమ్షీ ఖలీద్,
సంగీతం: జేక్స్ బిజోయ్,
ఎడిటింగ్: చమన్ చాకో
లైన్ ప్రొడ్యూసర్: బిబిన్ పెరుంబిల్లి,
ప్రొడక్షన్ హెడ్స్: సుజోయ్ జేమ్స్, దేవదేవన్,
ప్రొడక్షన్ డిజైనర్: అజయన్ చలిసేరి,
మేకప్: రోనెక్స్ జేవియర్,
కాస్ట్యూమ్: మషార్ హంస,
ప్రొడక్షన్ కంట్రోలర్: దీపక్ పరమేశ్వరన్,
అసోసియేట్ డైరెక్టర్: రోహిత్ చంద్రశేఖర్,
సాహిత్యం: మను మంజిత్, వినాయక్ శశికుమార్,
VFX: తౌఫీక్ (ఎగ్ వైట్),
పోస్టర్ డిజైన్: టెన్ పాయింట్,
సౌండ్ డిజైన్: సింక్ సినిమా,
సౌండ్ మిక్స్: కన్నన్ గణపతి,
స్టిల్స్: SBK,
మార్కెటింగ్ హెడ్: విజిత్ విశ్వనాథన్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.