Skip to content

‘మోజు” టైటిల్ ఖరారు

సినిమా నిర్మాణం అంటే ఆయనకు ప్యాషన్ కాదు. ఒక “అబ్సెషన్”. అందువల్లే అతి తక్కువ కాలంలో నిర్మాతగా “సెంచరీ” కొట్టి డబుల్ సెంచరీ దిశగా ముందుకు సాగుతున్నారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ఈ క్రమంలో ఈ శతాధిక చిత్ర నిర్మాత మరో చిత్ర నిర్మాణం కోసం సన్నాహాలు చేస్తున్నారు.

ఈసందర్భంగా తుమ్మలపల్లి మాట్లాడుతూ…”మా భీమవరం టాకీస్ పతాకంపై 122వ చిత్రంగా సెట్స్ పైకి వెళ్లనున్న చిత్రానికి ‘మోజు” అనే టైటిల్ ఖరారు చేశాం. ఈ చిత్రానికి ప్రేరణ మా ఆర్జీవి. ఈమధ్య ఆయన్ని ముంబైలో కలిసినప్పుడు… ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధిస్తున్న “ది అబ్సెషన్” తరహాలో ఓ చిత్రం చేయమని నాకు సూచించారు. మన ఇండియన్ కరెన్సీలో కేవలం 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి, ఇప్పటికి 4 వేల కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించిన ఈ చిత్రం స్పూర్తితో ఓ పాన్ ఇండియా సినిమా కోసం చేస్తున్న కథాచర్చలు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చాయి. త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తాం” అని అన్నారు!

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.