‘రామాయణ’లో దశరథుడిగా అరుణ్ గోవిల్ ఫస్ట్ లుక్ రిలీజ్
‘రామాయణ’ మేకర్స్ అరుణ్ గోవిల్ దశరథుడిగా నటిస్తున్న ప్రత్యేక సోలో పోస్టర్‌ను విడుదల చేశారు. ఐకానిక్ రాముడి పాత్రతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అరుణ్ గోవిల్‌కు ఇది మరో ముఖ్యమైన అధ్యాయంగా నిలవనుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో అరుణ్ గోవిల్ అయోధ్య రాజు దశరథుడి పాత్రలో కనిపిస్తున్నారు. శ్రీరాముడి తండ్రి, అయోధ్య రాజుగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఈ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ఇతిహాస చిత్రంలో అరుణ్ గోవిల్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే ఆయన శ్రీరాముడిగా కోట్లాది మంది భారతీయ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. దేశవ్యాప్తంగా శ్రీరాముడి పాత్రలో ఎంతో పేరు తెచ్చుకున్న…
