అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్పేస్‌ను డామినేట్ చేస్తూ ఇండియా వైడ్ నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
అడివి శేష్ మరోసారి డిజిటల్ స్పేస్‌పై తనకున్న పట్టుని నిరూపించారు. ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రం మే 8, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెంటనే ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. మంచి కంటెంట్‌ను ఎంపిక చేసుకోవడంలో అడివి శేష్‌కు ఉన్న విజన్ ని మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్న కథలు, బలమైన కథనాలతో ఆయనకు ఉన్న…
