వైష్ణవ్ తేజ్ హీరోగా ‘హనుమాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్’
‘హనుమాన్’ యూనివర్స్ నుంచి మరో ప్రతిష్టాత్మక ఫాంటసీ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘హనుమాన్’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తమ ప్రతిష్టాత్మక ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ కొత్త ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను‘హనుమాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్’ పేరుతో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో టాలెంటెడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించనున్నారు. ఫాంటసీ కథలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారు. యంగ్ ఎనర్జీ, భారీ ఫాంటసీ కాన్సెప్ట్ కలయికలో ఈ సినిమా రూపొందనుంది. ‘హనుమాన్ 2 – ది రైజ్ ఆఫ్…
