మానవత్వాన్ని చాటుకున్న దశరధ.. ‘కిల్లర్’ సినిమా విజయానికి రామచంద్ర శుభాకాంక్షలు
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న అయినబత్తిన దశరధ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ‘వెంకీ’ సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన కమెడియన్ రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న దశరధ, ఆయనను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రామచంద్రకు దశరధ ధైర్యం చెప్పారు. తోటి కళాకారుడి కష్టాన్ని అర్థం చేసుకుని, తన వంతు సహాయం అందించడం ద్వారా మానవత్వమే నిజమైన గొప్పతనమని చాటుకున్నారు. ఈ సందర్భంగా దశరధ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర కళాకారులంతా ఒక కుటుంబంలా ముందుకొచ్చి రామచంద్రకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన చికిత్సకు మరింత…
