రాజమౌళి, మహేష్ బాబు, తెలుగు సినిమా గౌరవం దృష్ట్యా నా డ్రీమ్ టైటిల్‌ను స్వచ్చందంగా ఇచ్చేశాను – దర్శకుడు సుబ్బారెడ్డి
దర్శకుడు సుబ్బారెడ్డి తన వద్ద రిజిస్టర్ అయిన 'వారణాసి' సినిమా టైటిల్‌ను దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రానికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్, దర్శకుడు సుబ్బారెడ్డి కలిసి ఇంటర్వ్యూలో చర్చించారు. దర్శకుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ, 2023లో 'వారణాసి' టైటిల్‌ను తన బ్యానర్‌పై రిజిస్టర్ చేసుకుని ఆ కథపై పని ప్రారంభించానని తెలిపారు. అయితే అదే టైటిల్ రాజమౌళి సినిమా కోసం అవసరమైందని తెలిసిన తర్వాత, తెలుగు సినిమా గౌరవం దృష్ట్యా ఎలాంటి సందేహం లేకుండా ఇవ్వాలని నిర్ణయించుకున్నానన్నారు. తన అభిమాన హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, నిర్మాత…
