‘ఫంకీ’ చిత్రం నుంచి మూడో గీతం ‘యమ యమ్మ’ విడుదల
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న ‘ఫంకీ’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ‘ధీరే ధీరే’, ‘రట్టాటటావ్’ పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతం ‘యమ యమ్మ’ విడుదలైంది. సోమవారం సాయంత్రం తిరుపతిలో ఈ గీతావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. శ్రోతలను ఉర్రూతలూగించేలా భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ మాస్ గీతం, విన్న వెంటనే ఆకట్టుకునేలా ఉంది. అందరూ కాలు కదిపేలా భీమ్స్ అందించిన ఉత్సాహభరిత సంగీతం, ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దేవ్ పవార్ అందించిన సాహిత్యం, మాస్ పాటకు తగ్గట్టుగా మళ్ళీ మళ్ళీ పాడుకునేలా ఉంది. గాయని రోహిణి…
