‘జనవరి 12 విడుదల’ నుంచి ‘డివికి డివికి’ సాంగ్ రిలీజ్
విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘జనవరి 12 విడుదల’. హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. కలర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను అలరించనుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్…
