Skip to content

ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యగ్రంథంగా చేర్చాలి, టీడీ జనార్ధన్ ఓ అరుదైన నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు – మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు

ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక రామారావు రాజకీయ నాయకుడిగా రాష్ట్ర దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని, రాజకీయాల్లోకి యువత ను, బడుగులను ప్రోత్సహించి రాజకీయాలను మలుపు తిప్పిన మహనీయుడని, అటువంటి వ్యక్తి పేరిట నెలకొల్పిన అవార్డును నిజాయితీపరుడు, నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు టిడి జనార్దన్ కు అందించడం సముచితమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రముఖ సాంస్కృతిక సంస్థ రసమయి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు హైదరాబాదులోని త్యాగరాజ గాన సభలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ…

Read more
మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి Telugu News

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి

--ఎం.వెంకయ్య నాయుడు* అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 'మీర్జాపురంరాణి -కృష్ణవేణి' పుస్తకాన్ని రచయిత భగీరథ, నిర్మాత ఎన్.ఆర్. అనురాధాదేవి వెంకయ్య నాయుడుకి బహుకరించారు . ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ... "తెలుగు సినిమా ప్రారంభ రోజుల్లో బాల నటిగా ప్రవేశించి, కథానాయికగా ఎదిగిన కృష్ణవేణమ్మ మీర్జాపురం రాజావారిని వివాహం చేసుకోవడంతో ఆమె జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది" అని చెప్పారు. "కృష్ణవేణమ్మ కేవలం నటి, గాయనిగానే కాదు అభిరుచి కలిగిన నిర్మాత, ఎన్నో సందేశాత్మక సినిమాలను రూపొందించారు. ముఖ్యంగా ఎన్ .టి …

Read more
1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తక ఆడియో రూపం Telugu News

1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తక ఆడియో రూపం

ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 6న విజయవాడ లో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, త్రిపుర రాష్ట్ర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి, అసెంబ్లీ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా విడుదల అయిన విక్రమ్ పూల రచించిన 1984: పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని ఆడియో రూపంలోకి తెస్తున్నాము. ఈ పుస్తకానికి లభించిన అపూర్వ ఆదరణ నేపథ్యంలో దీనికున్న చారిత్రక ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని ఆడియో రూపంలో అందిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఉన్న తెలుగు ప్రజలకు చేరుతుందనే ఉద్దేశ్యంతో ప్రముఖ యాంకర్ శ్రీమతి గాయత్రి గాత్రధారణలో ఆడియో పుస్తకాన్ని అందిస్తున్నట్లు గా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ…

Read more
ఆ పాత్రే తప్ప సావిత్రి గారు కనపడే వారు కాదు- భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు Telugu News

ఆ పాత్రే తప్ప సావిత్రి గారు కనపడే వారు కాదు- భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు

మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా వారి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ ‌ ఛైర్మన్‌ సంజయ్‌కిషోర్‌ నిర్వహణలో హైదరాబాద్‌ లో సావిత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సావిత్రి గారి ఫొటోలతో అందంగా తీర్చిదిద్దిన వేదిక పై జరిగిన ఈ జయంతి ఉత్సవాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ- మహానటికి మరణం లేదని, నవరస అద్భుత నటనా కౌశలంతో ప్రేక్షకులను మైమరపించేవారని అన్నారు. తన నట జీవితంలో ప్రతి చిత్రంలో కూడా కేవలం పాత్ర మాత్రమే కనిపించేదని, సావిత్రి కనిపించేది కాదన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ-…

Read more