Skip to content

నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్ పూర్తి

బ్లాక్‌బస్టర్ సక్సెస్ 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. 'అలియాస్ రుక్మిణి' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మాణంలో రొమాన్స్, హ్యూమర్, ఆసక్తికరమైన కథనంతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా హీరో నితిన్‌తో పాటు చిత్ర బృందం షూటింగ్ కంప్లీషన్‌ను సెలబ్రేట్ చేసుకుంది. సెట్స్‌లో చిత్ర యూనిట్ అంతా కలిసి ఆనందంగా గడిపిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది…

Read more