Skip to content

‘నువ్వుంటే నా జతగా’తో ఓటీటీలోకి అడుగుపెట్టిన నటి శ్రుతి రెడ్డి

తమిళ చలనచిత్రం ‘మెరీనా పురట్చి’లో కథానాయికగా పరిచయమైన నటి శ్రుతి రెడ్డి, ఇప్పుడు తెలుగు రొమాంటిక్ డ్రామా సిరీస్ ‘నువ్వుంటే నా జతగా’తో ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టారు. కుకు టీవీలో ప్రసారమవుతున్న ఈ సిరీస్‌లో మనోజ్ నందం కథానాయకుడిగా నటించారు. రాజగిరి దర్శకత్వం వహించగా, పవన్ కుమార్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ సిరీస్‌లో శ్రుతి రెడ్డి మాధవి శ్రీలత అనే అమాయకమైన నర్సు పాత్రలో కనిపిస్తారు. శక్తివంతమైన మాఫియా డాన్ విరాజ్ వర్ధన్ (మనోజ్ నందం) పరిచయంతో ఆమె జీవితం అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. భయం, సంఘర్షణలు, భావోద్వేగపూరితమైన పరిస్థితులు, చివరకు ప్రేమగా మారే వారి ప్రయాణం ద్వారా నటిగా శ్రుతి తనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించే అవకాశం లభించింది. మాధవి…

Read more