‘ఎన్టీఆర్‌నీల్’ 2027 జూన్ 11న గ్రాండ్ రిలీజ్
ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కెజియఫ్ సిరీస్, సలార్ లాంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో భారీ యాక్షన్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తాత్కాలికంగా ఎన్టీఆర్ నీల్ మూవీ అని పిలుస్తున్నారు. ఈ సినిమాపై ఇటు ఫ్యాన్స్, అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక ఎగ్జయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ గ్లింప్స్, సినిమా రిలీజ్ డేట్ గురించి వివరాలను తెలియజేశారు. ‘ఎన్టీఆర్‌నీల్’ ఫస్ట్ గ్లింప్స్‌ను మే 20, 2026న, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా…
