‘రామాయణ’ పార్ట్ 1 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
దసరా నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం నవరాత్రుల తొలి రోజును పురస్కరించుకుని ‘రామాయణ’ మేకర్స్ ప్రత్యేక ప్రకటన చేశారు. రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా, రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా కనిపిస్తున్న కొత్త పోస్టర్ను విడుదల చేశారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ఇతిహాస చిత్రంలో పార్ట్ 1 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు. “యే రామ్ కే యుగ్ కా ఆరంభ్ హై” (ఇది రాముడి యుగానికి ఆరంభం) అనే సందేశంతో కొత్త శకానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ దసరా నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తాజాగా విడుదలైన పోస్టర్లో శ్రీరాముడిగా రణ్బీర్…
