Skip to content

‘బరాబర్ ప్రేమిస్తా’ తో చంద్రహాస్‌కు బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను.. ఆది సాయి కుమార్

‘బరాబర్ ప్రేమిస్తా’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ లెక్కపెట్టలేనన్ని, ఊహించలేనన్ని ట్విస్ట్‌లతో ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది .. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ హీరోగా సంపత్ రుద్ర తెరకెక్కించిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఆదివారం…

Read more

పద్మశ్రీ వరించిన సందర్భంగా మురళీ మోహన్‌ను సన్మానించిన ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ టీం

లెజెండరీ యాక్టర్ మురళీ మోహన్‌కు కేంద్రం తాజాగా పద్మశ్రీని ప్రకటించిన సంగతి తెలిసిందే. మురళీ మోహన్‌కి పద్మశ్రీ ప్రకటించడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. ఇక ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి అభినందిస్తున్నారు. ఈ క్రమంలో ‘డొక్కా సీతమ్మ’ టీం ఆయన్ను స్వయంగా కలిసి సన్మానించింది. డొక్కా సీతమ్మ టీం మురళీ మోహన్ ఇంటికి వెళ్లింది. దర్శక, నిర్మాతలు మురళీ మోహన్‌ను కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సినిమాలోని ఆర్టిస్టులు, ఇతర కాస్ట్ క్రూ మెంబర్స్ అంతా పాల్గొన్నారు. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. టైటిల్…

Read more

బ్లాక్ బస్టర్ చిత్రాల్లో విలన్‌గా దూసుకుపోతోన్న విలక్షణ నటుడు సుదేవ్ నాయర్

మలయాళ నటుడు సుదేవ్ నాయర్ విలక్షణమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. తెరపై ఆయన పోషిస్తున్న పాత్రలు, చూపిస్తున్న విలనిజం, బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఆయన పని తీరు అందరినీ మెప్పిస్తోంది. ఆయన కనిపిస్తున్న ప్రతీ సినిమా రీసెంట్‌గా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. గత ఏడాది వచ్చిన ‘ఓజీ’ చిత్రంలో సుదేవ్ నాయర్ పాత్రకు, ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో సుదేవ్ నాయర్ మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. చిరంజీవితో పాటుగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలో అతని పాత్ర, నటించిన తీరు తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. అనిల్ రావిపూడి…

Read more

సీతా పయనం నుంచి ‘పయనమే’ సాగే మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు వదిలిన కంటెంట్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ క్రమంలో…

Read more

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం నుంచి గవర్నర్ ఎక్స్‌లెన్స్ అవార్డుని అందుకున్న లెజెండరీ యాక్టర్ డా. ఎం. మోహన్ బాబు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోల్‌కత్తాలోని లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక గవర్నర్ అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్‌ను లెజెండరీ యాక్టర్ డా. ఎం. మోహన్ బాబు అందుకున్నారు. గౌరవనీయులైన పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఈ అవార్డును విశిష్ట అతిథుల మధ్య ప్రదానం చేశారు. తరువాత సాంప్రదాయ ఎట్ హోమ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు కుమారుడు, మా అధ్యక్షుడు విష్ణు మంచు, మా కోశాధికారి శివ బాలాజీ సందడి చేశారు. ప్రస్తుతం భారతదేశం అంతటా తెలుగు సినిమా ప్రభావం కనిపిస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక తెలుగు నటుడికి ఇటువంటి గౌరవాన్ని ప్రదానం చేయడం ఓ ప్రత్యేక చరిత్రను సృష్టించినట్టుగా నిలిచింది…

Read more

‘పురుష:’ నుంచి ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి పాడిన ‘జాలి పడేదెవ్వడు’ పాట విడుదల

భార్యాభర్తల తగువులు, గిల్లికజ్జాలు, సంసారం చుట్టూ అల్లే కథలు ఎప్పటికీ ఆడియెన్స్‌కి బోర్ కొట్టవు. ఇక ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా భార్యాభర్తల బంధాన్ని వివిధ కోణాల్లో టచ్ చేస్తూ తీస్తున్న చిత్రం ‘పురుష:’. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు ఈ ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నాడు. కేవలం పోస్టర్లు, ఫస్ట్ లుక్స్‌తోనే జనాల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిన మేకర్స్.. రీసెంట్‌గా టీజర్‌తో అందరినీ తెగ నవ్వించేశారు. ఇక తాజాగా ఈ చిత్రంలోని థీమ్ సాంగ్ అన్నట్టుగా.. మగాడి మీద జాలి కలిగేలా, మగాడి పరిస్థితిపై సానుభూతి పెరిగేలా ‘జాలి పడేదెవ్వడు.…

Read more

ఫిబ్రవరి 6న బరాబర్ ప్రేమిస్తా విడుదల.. కాలేజీ స్టూడెంట్స్ నడుమ అట్టహాసంగా రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్

యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా నటించారు. ఇప్పటి వరకు ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా యూత్‌ను బాగా అట్రాక్ట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఈవెంట్ హైదరాబాద్ లోని బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ కాలేజీస్ లో నిర్వహించారు. స్టూడెంట్ తో…

Read more

పురుషః నుంచి వెన్నెల కిషోర్ పోస్టర్ రిలీజ్.. ఇంతకీ ఆ కిటికీ వద్ద ఏం జరుగుతోంది

భార్యాభర్తల కథకు కాస్త కామెడీ జోడించి, రియాలిటీకి దగ్గరగా చూపిస్తే ఆ సినిమా ఇచ్చే కిక్కే వేరేలా ఉంటుందని చెప్పుకోవచ్చు. సరిగ్గా అదే లైన్ తీసుకొని వినూత్నంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘పురుష:’ మూవీ. ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చేస్తూనే డిఫరెంట్ స్టైల్ ప్రమోషన్స్ చేపడుతూ ఆడియన్స్ దృష్టిని లాగేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు ‘పురుష:’ మూవీ టీమ్ వదులుతున్న పోస్టర్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలు చూపిస్తూనే.. పెళ్లి తర్వాత జీవితంలో భార్యల ఇంపార్టెన్స్ ఏంటనేది ఈ సినిమాలో చూపించనున్నారని ఇప్పటికే విడుదల చేసిన టీజర్ స్పష్టం చేసింది. ఇక తాజాగా…

Read more

ఘనంగా ఆత్రేయపురం బ్రదర్స్ మూవీ ప్రారంభం.. ఆసక్తి రేకెత్తిస్తున్న కాన్సెప్ట్ పోస్టర్

ఒక్కప్పటిలా లేవు రోజులు.. ట్రెండ్ మారింది. అందుకు తగ్గట్టుగా ఆడియన్స్ ఆలోచనలు, టేస్ట్ కూడా మారిపోయాయి. కాబట్టి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కొత్త కొత్త కథలతోనే మేకర్స్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ఓ వైవిద్యభరితమైన స్టోరీ తీసుకొని, ఇప్పటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో ఆత్రేయపురం బ్రదర్స్ అనే సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ రాజేష్ జగన్నాధం. S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజీవ్ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్సా, రఘు బాబు, గీత్ సాయిని, నేహా పఠాన్, సిద్దార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు…

Read more

విశాల్ మొగుడు గ్లింప్స్ రిలీజ్.. సినిమాపై హైప్ పెంచేసిన వీడియో

తమిళ దర్శకుల్లో ‘సుందర్ C’ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆయన తీసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో ఓ సినిమా రూపొందిస్తున్నారు సుందర్ సి. అవ్ని సినీమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై కుష్బూ సుందర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు A.C.S అరుణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొగుడు అనే టైటిల్ తో రాబోతున్న చిత్రంలో విశాల్‌ సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా.. కమెడియన్ యోగిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హిప్ హాఫ్ తమీజా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, మరోవైపు ప్రమోషన్స్…

Read more