‘పెద్ది’ మేనియా ప్రారంభం, దేశవ్యాప్తంగా ఎప్పుడూ చూడని వినూత్న ప్రచార కార్యక్రమం- పెద్ది పవర్‌ప్లే టూర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మచ్ అవైటెడ్ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై రోజురోజుకీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్‌తో చిత్రబృందం సినిమాపై హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్తోంది.ఇప్పటికే విడుదలైన రెండు హై-వోల్టేజ్ పాటలు, రెండు విభిన్న గ్లింప్సెస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ‘పెద్ది’ జూన్ 4న గ్రాండ్ పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, జూన్ 3న స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో పాన్ ఇండియా…
