Skip to content

ఆగస్టు 31న ‘డాయ్‌రా’ ట్రైలర్ విడుద‌ల‌

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘డాయ్‌రా’ చిత్ర బృందం న్యూ అప్‌డేట్‌ ఇచ్చింది. కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో కాంబినేష‌న్‌లో ఒక పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌తో సినిమా ఎలా ఉండబోతోందనే హింట్‌ను టీం ఇచ్చింది. ఆగస్టు 31న ట్రైలర్ విడుదల కానున్న తరుణంలో ఈ పోస్టర్, అందులోని హింట్స్ అన్నీ కూడా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసేలా ఉన్నాయి. కథ పట్ల ఆసక్తిని రేకెత్తించేలా కొన్ని అంశాలను రివీల్ చేస్తూనే ఆ పాత్రల మధ్య ఉన్న సంబంధం గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తేలా పోస్టర్ ఉంది. పోలీసుల హెచ్చరిక టేప్ (police tape) మధ్య, ఒకరికొకరు వ్యతిరేకదిశలో నిలబడి ఉన్న కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్…

Read more

‘మహావీర్ కర్ణ’ డిసెంబర్ 4న రిలీజ్

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు పెన్ మూవీస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్.. ఆర్‌వీ స్టూడియోస్‌తో కలిసి ‘మహావీర్ కర్ణ’ అనే ఎపిక్ హైబ్రిడ్ లైవ్ యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి. భారతీయ సినిమాను సరికొత్త విజువల్ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ ఈ ప్రెస్టీజియ‌స్‌ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్‌గా స‌క్సెస్ అయిన ‘రాక్షసుడు’, ‘ఖిలాడీ’ వంటి డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీస్‌తో త‌నదైన గుర్తింపు తెచ్చుకున్న రమేష్ వర్మ.. ‘మహావీర్ కర్ణ’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. యాక్షన్, థ్రిల్లర్, కమర్షియల్ సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్ట‌ర్‌ రమేష్ వర్మ.. ఇప్పుడు సరికొత్త జోనర్‌లోకి…

Read more

‘ప్యార్ ప్రేమ క‌ళ్యాణం’ ఆగ‌స్ట్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఎల‌న్‌, శాన్వీ మేఘ‌న హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘ప్యార్ ప్రేమ క‌ళ్యాణం’. ఎ రైజ్ ఈస్ట్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఎల‌న్ దర్శ‌క‌త్వంలో శ్రీనిధి సాగ‌ర్ నిర్మించిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఫిల్మ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో.. నిర్మాత శ్రీనిధి సాగ‌ర్ మాట్లాడుతూ ‘‘నేను గుంటూరు వాడిని. అయితే చెన్నైలో చదువుకున్నాను. అక్కడే సెటిలైయ్యాను. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో నా రెండో సినిమా. ఈ ఏడాది మార్చిలో మేడిన్ కొరియా అనే సినిమాను రిలీజ్ చేశాం. దాని త‌ర్వాత మేం చేసిన సినిమా ఇది. మా తొలి సినిమాలాగానే ఈ సినిమా కూడా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుంద‌ని భావిస్తున్నాం. ఓ…

Read more

‘డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్’ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ‘కేకు వాకు’ రిలీజ్

వైవిధ్యమైన పాత్రల్లో నటించి విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు పొందిన స్టార్ యాక్ట‌ర్ ఫ‌హాద్ ఫాజిల్‌, ఇండ‌స్ట్రీ హిట్ బాహుబ‌లి మూవీని నిర్మించిన మేక‌ర్స్‌తో పాటు సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి క‌ల‌యిక‌లో రూపొందుతోన్న చిత్రం ‘డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్’. షోయింగ్ బిజినెస్ బ్యాన‌ర్‌పై తన తొలిసారి డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రేమ‌లు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఎస్.ఎస్. కార్తికేయ..ఇప్పుడీ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ను ఇండియ‌న్ సినిమాకు గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన బాహుబ‌లి ఫ్రాంచైజీ నిర్మాతలైన ఆర్కా మీడియాతో క‌లిసి రూపొందిస్తున్నారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి కొత్త దర్శకుడు శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత‌లు…

Read more

విశాఖ‌పట్నం ఇనార్బిట్ మాల్‌లో స‌రికొత్తగా గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌నున్న AAA సినిమాస్‌

ప్రీమియం సినిమా అనుభూతికి పేరుగాంచిన AAA సినిమాస్..విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. అత్యాధునిక టెక్నాలజీ, వరల్డ్‌క్లాస్ సినిమా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు ప్రీమియం హాస్పిటాలిటీని ఒకే చోట అందిస్తూ ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు AAA సినిమాస్ సిద్ధమైంది. ఈ AAA సినిమాస్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి వ్యాపార, సినీ పరిశ్రమల‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీంతో విశాఖపట్నం ఎంటర్‌టైన్‌మెంట్ ల్యాండ్‌స్కేప్‌లో AAA సినిమాస్‌ మరో కొత్త ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్ర‌ముఖ నిర్మాత‌లు అల్లు అరవింద్, ఏషియన్ సునీల్ నారంగ్, భారత్ నారంగ్, సిమ్రన్ నారంగ్, జ్యేష్ఠ్ నారంగ్, మురళీమోహన్, ఆర్కిటెక్ట్ ఎర్రన్న యెక్బోటే, నిర్మాత బన్నీ వాస్, విశాఖపట్నం నార్త్…

Read more

‘గజ’ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను: మంచు మనోజ్

చల‌మ‌ల‌శెట్టి సునీల్ సమర్పణలో సతీష్ జై ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో డా. మైత్రి శరణ్ నిర్మించిన చిత్రం ‘గజ’. ప‌ద్మ‌నాభ రెడ్డి, జి.మ‌ధుసూద‌న్‌, ఎం.న‌రేంద్ర స‌హ నిర్మాత‌లు. ఈ సినిమాకి సతీష్ జై దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాని మైత్రి మూవీస్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం నాడు గజ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి మంచు మనోజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. మంచు మనోజ్ మాట్లాడుతూ .. ‘‘సతీష్ జై హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ధైర్యం చేసి అడుగు ముందుకు వేశారు. చాలా…

Read more

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ నుంచి రెండు స్పెషల్ స్టిల్స్‌ను విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వారణాసి’ చిత్రం నుండి రెండు ప్రత్యేక స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ స్టిల్స్‌తో రుద్ర తన నేచురల్ లుక్‌లో ప్రపంచానికి తొలిసారిగా కనిపించాడు. మొదటి స్టిల్‌లో దట్టమైన అడవి మధ్యలో ఒక వెదురు తెప్పపై విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా రుద్ర కనిపిస్తున్నాడు. ఇక ఆ స్టిల్‌ను చూస్తే పాలసంద్రంలో ఆదిశేషుపై సేదతీరే శ్రీ మహా విష్ణువులా కనిపిస్తున్నారు. ఇంకో స్టిల్‌లో కెన్యాలోని మసాయి మారా విశాలమైన మైదానాలకు చెందింది. అక్కడ రుద్ర జిరాఫీలు, వైల్డ్‌బీస్ట్‌ల మధ్య నిలబడి, వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఈ రెండు స్టిల్స్‌ను గమనిస్తే ‘వారణాసి’ సినిమాలోని సోల్, రుద్ర పాత్ర తీరు గురించి అందరికీ…

Read more

అల్లు అర్జున్ ఫ్రెండ్‌షిప్ డే సందేశం

నిజమైన విజయమంటే మన స్నేహితులను కూడా మనతో పాటు ముందుకు తీసుకెళ్లడమే.. సినిమా రంగంలో విజయం మ‌న చుట్టూ ఉన్న చాలా విషయాలను మార్చేస్తుంది. ఈ క్ర‌మంలో మన కెరీర్‌లు మారుతాయి. మన బంధాలు, సంబంధాల సమీకరణాలు మారిపోతాయి. స్నేహాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే నిజమైన విజయం అంటే కేవలం అత్యుతన్న స్థానాన్ని చేరుకోవడం మాత్రమే కాదని..మనవాళ్లను కూడా మనతో పాటు తీసుకెళ్లడమే అని గుర్తు చేసే వారుంటారు. అలాంటి అరుదైన వ్య‌క్తే అల్లు అర్జున్‌. ఆయ‌న ఎలాంటి హంగామా లేకుండా నిశ్శబ్దంగా అదే చేసి చూపించారు. కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో AA23 చిత్రాన్ని ప్రకటించినప్పుడు, సహజంగానే అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్ భారీ…

Read more

రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘లెనిన్’

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మొదటి రోజు నుంచే ‘లెనిన్’ రికార్డుల్ని సృష్టించడం ఆరంభమైంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఏకంగా వంద కోట్ల క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఇప్పటి వరకు వంద కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టిందని మేకర్స్ అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘లెనిన్’ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు అందించిన కథ, కథనం అన్నీ కూడా సినిమాకి…

Read more

1,000 మంది అభిమానులతో ఆప్యాయంగా మాట్లాడిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారతదేశంలోని ఏడు రాష్ట్రాల నుండి వచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ AAFAకు చెందిన దాదాపు 1,000 మంది సభ్యులతో ఆరు గంటలకు పైగా సమయాన్ని గడిపారు. వచ్చిన ప్రతీ అభిమానితో అల్లు అర్జున్ ఆప్యాయంగా మాట్లాడారు. అందరికీ విలువైన సలహాల్ని అందించారు. ప్రతీ ఒక్క సభ్యునికి అల్లు అర్జున్ ప్రత్యేకంగా ఫోటోలను ఇచ్చారు. అల్లు అర్జున్ తన ఫ్యాన్స్‌తో కలిసి నవ్వుతూ ముచ్చటించడమే కాకుండా కలిసి నృత్యం చేశారు. ఒకరినొకరు అభిప్రాయాల్ని పంచుకున్నారు. అల్లు అర్జున్ తన స్టైల్లో ప్రసంగాన్ని ఇస్తూ ఎన్నో చమత్కారాలు చేశారు. ఆ ప్రాంగణం, అక్కడి వాతావరణం ఒక సెలబ్రిటీ కార్యక్రమంలా కాకుండా ఫ్రెండ్స్ గెట్ టుగేదర్‌లా తలపించింది. ఇది తన…

Read more