Skip to content

‘ఓం’ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సాయిపల్లవి

వెర్స‌టైల్ స్టార్ హీరో ధనుష్ క‌థానాయ‌కుడిగా.. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న‌ భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓం – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్’ నుంచి హీరోయిన్‌ సాయిపల్లవి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో విడుదలైంది. ఈ సినిమాలో ఆమె నిత్యారెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో సాయిపల్లవి ఆకట్టుకుంటున్నారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆమె తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి పాత్ర విష‌యానికి వ‌స్తే.. నిత్యారెడ్డి తెలివితేటలు, నిజాయతీ, అనుభవం ఉన్న యువ పోలీస్ ఆఫీసర్‌గా పరిచయమైంది. గతంలో సీబీఐ, ఇంటర్‌పోల్‌లో పనిచేసిన ఆమె.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్…

Read more

ధనుష్ ‘ఓం’ నుంచి రిలీజైన సెకండ్ సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్

‘వీళా వీర‌’ అంటూ తమిళంలో.. ‘వీర వీర’ అంటూ తెలుగు, హిందీలో ఆకట్టుకుంటోన్న పాట‌ వెర్స‌టైల్ స్టార్ ధనుష్ హీరోగా, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం – చాప్టర్ 1: ఉదిరం’ సినిమా నుంచి విడుదలైన రెండో పాట ‘వీళా వీర’కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వ‌స్తోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. హీరో ప‌వ‌ర్‌, పరాక్రమం, గంభీరమైన వ్యక్తిత్వం, వీరోచిత విన్యాసాలను ఆవిష్కరిస్తూ రూపొందించిన ఈ పాట అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉత్సాహభరితమైన ప్రదర్శన, హీరో పాత్రను శక్తిమంతంగా చూపించిన తీరు సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఈ పాటకు సాయి అభ్యంకర్ సంగీతం…

Read more

అల్లరి నరేష్ ‘కనకదుర్గ’ సినిమా నుంచి ‘అమ్మ కనకదుర్గ’ పాటను ఆవిష్కరించిన తమన్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట ‘అమ్మ కనకదుర్గ’ను విజయవాడలో విడుదల చేశారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు తమన్ స్వరపరిచిన ఈ పాటను జీ మ్యూజిక్ కంపెనీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తమన్ ఎస్ సంగీతం అందించిన ఈ పాటకు సిరాశ్రీ సాహిత్యం అందించారు. కనకదుర్గమ్మ దివ్య అనుగ్రహం, శక్తి, ఆధ్యాత్మిక విశిష్టతను చాటిచెప్పేలా ఈ పాటను రూపొందించారు. భక్తి ప్రధానంగా తెరకెక్కుతోన్న‌ ఈ చిత్రంలోని అంతర్లీన భావాన్ని ఈ పాట‌ ఆవిష్కరిస్తోంది. విజయవాడలో ఈ పాటను విడుదల చేయడం వెనుక ప్రత్యేకమైన కార‌ణం ఉంది. శ్రీ కనకదుర్గమ్మవారి ప్రసిద్ధ ఆలయం ఉన్న ఈ నగరానికి అమ్మవారితో…

Read more

‘AA23’పై స్పెషల్ అప్‌డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించనున్న చిత్రం ‘AA23’. ఈ మూవీ ప్రకటనతో రీసెంట్‌గా సోషల్ మీడియాలో భారీ సందడి నెలకొన్న సంగ‌తి తెలిసిందే..ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అల్లు అర్జున్, లోకేష్ కనక‌రాజ్ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా రాబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై హ్యూజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన‌ అనౌన్స్‌మెంట్ సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, సినీ ప్రియుల మధ్య ఈ పాట హాట్ టాపిక్‌గా నిలిచింది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ వంటి స్టార్స్…

Read more

‘చీన్ టపాక్ డమ్ డమ్’ ఫస్ట్ క్రాకర్ ఆవిష్క‌రించిన అడివి శేష్

అల్లరి, సరదా, నవ్వులతో ప్రేక్షకులను అలరించేందుకు ‘చీన్ టపాక్ డమ్ డమ్’ సిద్ధమవుతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన ఫస్ట్ క్రాకర్‌ను హిట్ మెషీన్ అడివి శేష్ ఆవిష్కరించారు. ఈ ఫస్ట్ క్రాకర్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. గవిరెడ్డి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి వై.ఎన్.లోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ టాకీస్ బ్యానర్‌పై శ్రీను నాగులపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిలేరియస్ సన్నివేశాలు, ఆసక్తికరమైన పల్లెటూరి నేపథ్యంతో ఈ సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచే ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇక మోషన్ పోస్టర్‌లోని “కాన్ సెన్స్ క్రౌన్స్ వెన్ కామన్ సెన్స్ డ్రౌన్స్’ అనే క్యాప్షన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ..సినిమాపై మరింత ఆస‌క్తిని పెంచుతోంది…

Read more

‘తెల్ల కాగితం’ సినిమా ‘కొత్త బంగారు లోకం’ లాంటి స్వచ్ఛమైన ప్రేమకథ – నిర్మాత దిల్ రాజు

నిర్మాత కృష్ణ‌న్న నిర్మించిన ‘తెల్ల కాగితం’ మూవీ అక్టోబ‌ర్ 2న విడుద‌లై పెద్ద విజ‌యం సాధించాలి - డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి* శ్రీమతి కె.శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘తెల్లకాగితం’. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందిస్తున్నారు. ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకుడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో బుధ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ వేడుకకు నిర్మాత టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, స్టార్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, కొరటాల శివ, చందు మొండేటి, వశిష్ట, శైలేష్ కొలను,…

Read more

‘ICONZA’కు శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్

న‌ట‌నా పరిధిని దాటి సరికొత్త సృజనాత్మక ప్రయాణానికి నాంది సుప్ర‌సిద్ధ న‌టుడు అల్లు రామ‌లింగ‌య్యగారి జ‌యంతి సంద‌ర్భంగా ఐకాన్ స్టార్ వేసిన అడుగుకు నెట్టింట ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ తన సృజనాత్మక ప్రయాణంలో మరో కీలక అడుగు వేశారు. తన తాత, ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా ‘ICONZA’ పేరుతో తన కొత్త క్రియేటివ్ ఆఫీస్ స్పేస్‌ను ప్రారంభించారు. స‌రికొత్త ఆలోచనలు, అద్భుత‌మైన సృజ‌న‌, ప‌ర‌స్పర స‌హ‌కారానికి, సంయుక్త కార్యాచ‌ర‌ణ‌కు వేదికగా ‘ICONZA’ను తీర్చిదిద్దుతున్నారు. ఈ నూతన ప్రయాణాన్ని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. అత్యంత ప్ర‌త్యేక‌మైన ఈ సందర్భాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో మొద‌లుపెట్టిన‌ట్టు ఐకాన్ స్టార్ గ్లింప్స్ షేర్ చేసి తెలిపారు…

Read more

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి : ఫహాద్ ఫాజిల్

ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకుడు. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో శనివారం ఫ‌హాద్ ఫాజిల్ మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి ఆయ‌న చెప్పిన‌ విశేషాలివే.. * ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా చేయటానికి కారణమేంటి? - కార్తికేయ నాకు ఫోన్ చేసిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కథ గురించి చెప్పారు. శశాంక్ వచ్చి కథ చెప్పారు. నా జీవితంలో అసలు ఇలాంటి ఓ కథను వినలేదు. విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. ఈ సినిమాని…

Read more

మ‌హా యోధుడు కర్ణుడిగా రాఘవ లారెన్స్

పెన్ మూవీస్‌ అధినేత జయంతిలాల్ గడా సమర్పణలో.. ఆర్‌వీ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్‌ అసోసియేషన్‌లో.. దర్శకుడు రమేష్ వర్మ నుంచి ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా ఎపిక్ ‘కర్ణ’. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మహాభారతంలోని మహావీరుడు కర్ణుడి మహాగాథ మరోసారి ఆవిష్కృతం కానుంది. ఈ మహా యోధుడి పాత్రలో ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. దర్శకుడు రమేష్ వర్మ తనదైన విజన్‌తో ఈ పురాణగాథను భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రూపొందుతోంది. ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక ఎపిక్‌.. అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ సాంకేతిక ప్రమాణాలతో…

Read more

‘తెల్ల కాగితం’ చిత్రాన్ని పెద్ద సక్సెస్‌ను అందిస్తారని ఆశిస్తున్నాను – హీరో సాయి దుర్గ తేజ్

శ్రీమతి కె. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘తెల్లకాగితం’. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందిస్తున్నారు. ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకుడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైల‌ర్‌ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, కోన వెంకట్, హరీష్ శంకర్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో.. *సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ .. ‘కృష్ణ గారితో నేను ‘జవాన్’ మూవీని చేశాను. కృష్ణ గారు నాకు ఇష్టమైన నిర్మాత…

Read more