‘పవర్ పేట’ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా అనౌన్స్‌మెంట్
నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నేతృత్వంలోని ప్రతిష్టాత్మక బ్యానర్ 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ కంటెంట్-బేస్డ్ సినిమాలకు మద్దతు ఇవ్వడంలో పేరు సంపాదించుకుంది. ఇప్పుడు వారు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. అర్థవంతమైన, బలమైన కథలను ఎంచుకోవడంలో పేరుపొందిన హీరో సందీప్ కిషన్, చిత్ర పరిశ్రమలో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఒక మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రతిభావంతుడైన రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్యతో ఎక్సయిటింగ్ కొత్త చిత్రాన్ని టీం అనౌన్స్ చేసింది. ఇది కథనం, వాస్తవికతకు దగ్గరగా ఉండే కథల బలమైన కలయికను అందిస్తుంది. 'పవర్ పేట' అనే టైటిల్ ఆసక్తికరంగా ఉంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా బలమైన ఇంప్రెషన్‌ను ఇస్తోంది. డార్క్, గ్రిట్టీ, సింబాలిజంతో నిండిన ఈ పోస్టర్‌లో రక్తంతో…
