‘పెద్ది’లో చేసిన అప్పలసూరి పాత్ర నా కెరీర్ లో నెంబర్ వన్ గా నిలుస్తుంది: జగపతి బాబు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వెర్సటైల్ స్టార్ జగపతి బాబు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. 'పెద్ది'లో అప్పలసూరి పాత్ర చాలా కొత్తగా కనిపిస్తోంది.. అది ఎలా సాధ్యమైంది? -ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ బుచ్చిబాబుకే దక్కుతుంది. ఆయన…
