శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న విడుదల కాబోతోన్న ‘బ్యాండ్ మేళం’
‘కోర్ట్’ చిత్రంతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానుంది. బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ‘బ్యాండ్ మేళం’ టీజర్, ట్రైలర్, మాస్ పెప్పీ సాంగ్ ‘తిప్పూ కుంటున్నావ్’, మంచి మెలోడీ సాంగ్ ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ వంటివి ఆడియెన్స్‌లో సినిమా పట్ల అంచనాల్ని పెంచేసింది…
