మహా శివరాత్రి సందర్భంగా మహా దేవుడిపై ‘శివ్ కైలాషోం కే వాసి’ పాటను పాడి ఆశ్చర్యపరిచిన రాశీ ఖన్నా
మహా శివరాత్రి పర్వదినాన దేశవ్యాప్తంగా శివ కీర్తనలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇక మహా దేవుడిపై తాజాగా రాశీ ఖన్నా పాడిన పాట ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. శివుడిపై తనకున్న భక్తిని చాటుకునేలా రాశీ ఖన్నా ఈ పాటను ఆలపించారు. భారత దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న రాశీ ఖన్నా ప్రస్తుతం శివ భక్తితో ఆడియెన్స్‌కి మరింత దగ్గరయ్యారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న రాశీ ఖన్నా ప్రస్తుతం శివుడిపై తన భక్తిని చాటుకునేలా పాటను పాడి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాను పాడిన పాటకు వస్తున్న ప్రశంసలపై రాశీ ఖన్నా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ‘‘శివ్ కైలాషోం కే వాసి’ అనేది అహంకారాన్ని నాశనం చేయడం,…
