‘జెట్లీ’ తో మార్నింగ్ షోనే ఫుల్ మీల్స్ పెడతాం: రితేష్ రానా
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ ఈరోజు సినిమా గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. సత్య వాయిస్ లో వేమన శతకంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. అకస్మాత్తుగా అల్లకల్లోలం ప్రయాణికులను భయాందోళనకు గురికావడం, తుపాకీ కాల్పులు, హైజాక్ గురించి సూచిస్తూ, సత్య పరిచయం కావడం ఆకట్టుకుంది సత్య పాత్రను పూర్తిగా హ్యూమర్ టచ్‌తో డిజైన్ చేశారు. మేకోవర్ తో అతని స్క్రీన్ ప్రెజెన్స్…
