Skip to content

‘రేజర్’ గ్లింప్స్ రిలీజ్

యూనిక్ స్టొరీ టెల్లింగ్, వైవిధ్యమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'రేజర్' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఆయన గత చిత్రం ఎనుగుతొండం ఘటికాచలం వంటి లైట్‌హార్టెడ్ కామెడీకి పూర్తి భిన్నంగా, డార్క్‌ అండ్‌ గ్రిట్టీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు. రవిబాబు–సురేష్ బాబు కాంబినేషన్‌లో మరోసారి వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకత్వంతో పాటు ఈ చిత్రంలో రవిబాబు హీరోగా కూడా నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పాత్ర ఇంటన్సిటీ తగ్గట్టుగా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ తో అలరించబోతున్నారు. తాజాగా విడుదలైన…

Read more

“హైలెస్సో” నుంచి అక్షర గౌడ ఫస్ట్ లుక్

సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ హీరోగా ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న చిత్రం హైలెస్సో. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌కు హీరోగా ఐదవ చిత్రం. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కోర్ట్ సినిమాలో తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్న శివాజీ విలన్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ కన్నడ నటి అక్షర గౌడ ఈ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ రోజు అక్షరగౌడకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మేకర్స్ వడ్డీ కాంతమ్మగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వడ్డీ…

Read more

‘మైసా’ నుంచి టీజర్ రిలీజ్

నేషనల్ క్రష్ రష్మిక లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఫీమేల్ -సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మైసా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆకట్టుకున్న టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్‌ల తర్వాత, తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. వణుకు పుట్టించే ఈ టీజర్, మైసా పాత్ర డార్క్ అండ్ ఇంటెన్స్ ప్రపంచాన్ని ప్రజెంట్ చేసింది. కథానాయిక తల్లి గొంతుతో వచ్చే ‘నా బిడ్డ ఊపిరి మోయలేక అగ్గే బూడిదైంది. నా బిడ్డను సంపలేక.. ఆఖరికి సావే సచ్చిపోయింది’ అనే పవర్ ఫుల్ వాయిస్ తో టీజర్…

Read more

నారి నారి నడుమ మురారి సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు: శర్వానంద్‌

చార్మింగ్ స్టార్ శర్వా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవ్వులు, భావోద్వేగాలు, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా కలయికలో పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య మహిళా కథానాయికలుగా నటించారు. మేకర్స్ ఇప్పుడు సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. కథ శర్వా పాత్ర చుట్టూ తిరుగుతుంది, అతను ప్రేమలో పడతాడు, తన గర్ల్ ఫ్రెండ్ తండ్రిని వారి వివాహానికి ఆమోదించమని ఒప్పిస్తాడు. అంతా సజావుగా జరుగతున్న సమయంలో, అతని మాజీ ప్రియురాలు అకస్మాత్తుగా ఆఫీస్ లోకి రావడంతో ఊహించని మలుపు తిరుగుతుంది…

Read more

ఛాంపియన్ తో 100% హిట్ కొడుతున్నాం: హీరో రోషన్

స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ 'ఛాంపియన్' అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా ఛాంపియన్ నైట్ ఈవెంట్ నిర్వహించారు. ఛాంపియన్ నైట్ లో హీరో రోషన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. అలాగే మాకు…

Read more

‘ఛాంపియన్’ లో హ్యూమన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది: హీరో రోషన్

స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ 'ఛాంపియన్' ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రోషన్ విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్ చరణ్ గారు మిమ్మల్ని చాలా ప్రశంసించారు కదా.. ఎలా అనిపించింది? -చాలా ఆనందంగా ఉంది. చరణ్ అన్న నాకు చిన్నప్పటి…

Read more

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మ్యాసీవ్ బజ్‌ను సృష్టించాయి. జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13న సంక్రాంతికి మీ అందరి ముందుకు రాబోతోంది. కచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో…

Read more

‘మహాకాళి’ నుంచి భూమి శెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్

హనుమాన్ సినిమాతో సూపర్ హీరో జానర్‌ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళిన విజనరీ ఫిల్మ్ మేకర్ ప్రసాంత్ వర్మ, RKD స్టూడియోస్ తో కలసి మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. వారి కొత్త చిత్రం మహాకాళి నుంచి లీడ్ ఫేస్‌ను పరిచయం చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో భూమి శెట్టి ప్రధాన పాత్రలో కనిపించగా, ఆమె లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా ఇప్పటికే 50%కు పైగా షూట్ పూర్తిచేసుకుంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్‌పై ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. సాధారణంగా నాన్-స్టార్ సినిమాలకు ఇంత భారీ బడ్జెట్ వెచ్చించేందుకు ప్రొడ్యూసర్లు వెనుకాడుతారు. కానీ మహాకాళి టీమ్ మాత్రం ఈ సాహసాన్ని చేసి చూపింది. పలువురు ఏ లిస్టు నటీమణులు సూపర్ హీరో…

Read more

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి ‘నువ్వుంటే చాలే’ రిలీజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ఆంధ్రా కింగ్. మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి వివేక్ & మెర్విన్ సంగీతం అందించారు. ఫస్ట్ ట్రాక్ నువ్వుంటే చాలే ప్రోమోస్ పాట పై చాలా బజ్ క్రియేట్ చేశాయి. మేకర్స్ లిరికల్ వీడియోను రిలీజ్ చేయడంతో మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ప్రేమకు హార్ట్ బీట్ ఉంటే అది 'నువ్వుంటే చాలే' లాగానే వుంటుంది. ఈ మెస్మరైజ్ సాంగ్ ఫస్ట్ నోట్ నుంచే మనల్ని అలరిస్తోంది. మ్యూజికల్ మ్యాజిక్, ఆర్కెస్ట్రేషన్, అకౌస్టిక్స్ అద్భుతంగా వున్నాయి. ఇది వెంటనే ఆల్-టైమ్ ఫేవరెట్ లవ్ సాంగ్స్ ప్లేలిస్టు…

Read more