Skip to content

శ్రీనివాస మంగాపురం తో జై కృష్ణ హీరోగా సక్సెస్ అయ్యాడు: ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

-శ్రీనివాస మంగాపురం సినిమాకు, నా పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు: హీరో జై కృష్ణ ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని బ్లాక్ బస్టర్ మూవీ 'శ్రీనివాస మంగాపురం' తో హీరోగా పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పించారు. నిర్మాత పి. కిరణ్ నిర్మించారు. రాషా తడాని హీరోయిన్ గా పరిచయమైయింది. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయం అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్…

Read more

‘రామాయణ’ ట్రైలర్ కు రెండు రోజుల్లోనే 350+ మిలియన్ల వ్యూస్‌

రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా, నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ: పార్ట్ 1' ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే అధికారిక ప్లాట్‌ఫార్మ్‌లలో 350 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందనతో ఈ చిత్రం 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ట్రైలర్‌కు సినీ అభిమానులు, విమర్శకులు, సెలబ్రిటీలు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా భారీ స్థాయి విజువల్స్, వరల్డ్ క్లాస్ VFX, భావోద్వేగభరితమైన కథనం, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా "Our Truth. Our History." అనే…

Read more

కింగ్ – జాకీ – క్వీన్ నుంచి నువ్వే తోపు సాంగ్ రిలీజ్

సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన పీరియడ్ క్రైమ్ డ్రామా #KJQ (కింగ్ - జాకీ - క్వీన్). 1990ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో 'దసరా', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాలతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. వీరితో పాటు నూతన నటుడు శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది కన్నుమూసిన దర్శకుడు KKకి ఇది చివరి చిత్రం. ఆయన క్రియేటివిటీ, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది ఒక నివాళిగా నిలుస్తుంది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది తాజాగా మేకర్స్ నువ్వే తోపు సాంగ్ రిలీజ్ రిలీజ్ చేశారు. పూర్ణచంద్ర…

Read more

8న ‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్

రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్' ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరదించుతూ మేకర్స్ తాజాగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 8, 2026న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొత్త పోస్టర్‌లో యష్ పోషిస్తున్న 'రాయా' పాత్రను సిల్హౌట్ రూపంలో చూపించారు. చేతిలో టామీ గన్ పట్టుకుని కనిపించే ఈ పోస్టర్, సినిమా ప్రపంచం ఎంత రా, ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో సూచిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌లాగే ఈ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తూ, సినిమా కథపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ట్రైలర్‌ను బెంగళూరులో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు…

Read more

‘కొరియన్ కనకరాజు’ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు: హీరో వరుణ్ తేజ్

-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేసిన వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ, యూవీ క్రియేషన్స్ & ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ 'కొరియన్ కనకరాజు' హైలీ ఎంటర్టైనింగ్ థ్రిల్లింగ్ ట్రైలర్‌ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్న 'కొరియన్ కనకరాజు' పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్, రెండు చార్ట్‌బస్టర్ పాటలు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలను మరింత పెంచేశారు. సత్య,అతని తండ్రి,…

Read more

‘నేను రెడీ’ మంచి విజయాన్ని సాధిం చాలి : డైరెక్టర్ వి.వి. వినాయక్

'నేను రెడీ' మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు: హీరో హవీష్ యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ ఎంటర్‌టైనర్ 'నేను రెడీ' ఇప్పటికే టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. హార్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. తొలి పాట 'కొంచెం కొంచెం' కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మెరుపులే మెరుపులే సాంగ్ లాంచ్ చేశారు. డైరెక్టర్ వివి వినాయక్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో హవీష్…

Read more

‘ది ప్యారడైజ్’ టీజర్ 6న రిలీజ్

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక 'పాన్-వరల్డ్' చిత్రం 'ది ప్యారడైజ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన లభించింది. పోస్టర్, టైటిల్ గ్లింప్స్‌తో పాటు, చిత్రంలోని మొదటి పాట 'ఆయా షేర్' బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దర్శకుడు శ్రీకాంత్ ఒడెల ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో, ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. SLV సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 6న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ అప్‌డేట్‌తో సినిమాపై నెలకొన్న ఆసక్తి మరింత పెరిగింది. 1 నిమిషం 35 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌లో సినిమా వరల్డ్ తో…

Read more

‘టాక్సిక్’ నుంచి కియారా అద్వానీ బర్త్‌డే పోస్టర్ రిలీజ్

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న 'టాక్సిక్' నుంచి కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్, కియారా బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. అద్భుతమైన డిజైన్‌తో రూపొందించిన ఎరుపు రంగు దుస్తుల్లో కియారా అద్వానీ ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆమె చూపులు, బోల్డ్ రూబీ లిప్స్, రాయల్ లుక్ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్లామర్‌కే పరిమితం కాకుండా, 'నాదియా' పాత్రలో కాన్ఫిడెన్స్, మిస్టరీ దాగి ఉన్న…

Read more

ఐదు భారతీయ భాషల్లో విడుదలైన ‘రామాయణ: పార్ట్ 1’ ట్రైలర్

నితీశ్ తివారి దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది అకాడమీ అవార్డులు (ఆస్కార్®️) గెలుచుకున్న విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో డీఎన్‌ఈజీ (DNEG), యశ్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో నిర్మితమవుతున్న 'రామాయణ: పార్ట్ 1' ప్రపంచవ్యాప్తంగా దీపావళి 2026 సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా సోనీ పిక్చర్స్, ఉత్తర భారతదేశంలో ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేయనున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'నమిత్ మల్హోత్రా రామాయణ: పార్ట్ 1' అఫీషియల్ ట్రైలర్‌ను చిత్ర బృందం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. జూలై 30 తెల్లవారుజామున విడుదలైన ఈ ట్రైలర్ హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను, సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది…

Read more

నాగ చైతన్య లాంచ్ చేసిన ‘పళ్ళబురుసు’ చిత్ర టీజర్‌

ఫోక్ చార్ట్‌బస్టర్ 'కొత్త సోకు' పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత, 'పళ్ళబురుసు ' చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను విడుదల చేసింది. యువసామ్రాట్ నాగచైతన్య లాంచ్ చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతూ, ప్రేక్షకులకు వినోదభరితమైన ప్రపంచాన్ని పరిచయం చేసింది. వేపపుల్లతో పళ్లు తోముకుంటున్న హీరోను చూసి గ్రామస్థులు "పళ్ళబురుసు తెలీదా?" అని ప్రశ్నించడంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ ఒక్క ప్రశ్నే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. టీజర్ ముందుకు సాగే కొద్దీ విచిత్రమైన పాత్రలు, సరదా సంఘటనలు, ఊహించని మలుపులు కనిపిస్తాయి. అయితే 'పళ్ళబురుసు' అంటే ఏమిటన్న మిస్టరీని మాత్రం అలాగే కొనసాగిస్తూ మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. కామెడీ, భావోద్వేగాలు, పల్లెటూరి నేపథ్యాన్ని…

Read more