Skip to content

‘పళ్ళబురుసు’ నుంచి కొత్త సోకు సాంగ్ రిలీజ్

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రం 'పళ్ళబురుసు' ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట 'కొత్త సోకు' లిరికల్ వీడియోను విడుదల చేశారు. పల్లె వాతావరణం, జానపద సంగీతం, పండుగ సందడిని ఆవిష్కరిస్తూ వచ్చిన ఈ పాట సినిమా ప్రపంచాన్ని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. కథానాయకుడి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందిన 'కొత్త సోకు' పాట సరదా సాహిత్యం, ఆకట్టుకునే బీట్‌తో అలరించింది "అంగి జూడే... ఆతడి పొంగు జూడే... దోతి రంగు జూడే..." అనే క్యాచీ హుక్ లైన్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, పళ్ళబురుసు ప్రపంచానికి ఓ అందమైన పరిచయాన్ని ఇస్తోంది. సురేష్ గంగుల సాహిత్యం…

Read more

#VenkyAnil5 (#NkrAR2)-తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 (#NKRAR2) చిత్రం కోసం జతకట్టారు. 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమా తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తైంది. ఈ షెడ్యూల్‌ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్‌లో నిర్మించారు. వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, కీర్తి సురేష్ కృతి శెట్టి షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో కీలకమైన టాకీ పార్ట్‌తో పాటు ఓ అద్భుతమైన పాటను చిత్రీకరించారు. చాలా ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ ఎపిసోడ్స్ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదల…

Read more

‘శ్రీ విష్ణు x రామ్ అబ్బరాజు 2’ లో హీరోయిన్ గా సాక్షి మడోల్కర్

హిలేరియస్ బ్లాక్‌బస్టర్ సామజవరగమనను అందించిన తర్వాత కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి జతకట్టారు. ప్రతిష్టాత్మక పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ ఎక్సయిటింగ్ అప్డేట్‌ను షేర్ చేశారు. ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమెకు టీమ్‌లోకి వెల్‌కమ్ చెబుతూ విడుదల చేసిన వీడియోలో షూటింగ్ స్పాట్‌లోని ఫన్ వైబ్‌ను చూపించారు. టీమ్ మొత్తం సరదాగా గడిపిన మూమెంట్స్‌తో ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 'శ్రీ విష్ణు x రామ్ అబ్బరాజు 2' కంప్లీట్ డిఫరెంట్ స్టయిల్ లో కొత్త కథాంశంతో కూడిన ఫ్రెష్ స్క్రిప్ట్‌. కాన్సెప్ట్, హై-వోల్టేజ్…

Read more

’35 – చిన్న కథ కాదు’ కు ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది: దర్శకుడు నందకిశోర్

2024 సంవత్సరానికి గాను '35 - చిన్న కథ కాదు' చిత్రం ఉత్తమ బాలల చిత్రం విభాగంలో జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఈ చిత్రంలో నటించిన అరుణ్‌దేవ్ పోతుల ఉత్తమ బాల నటుడు విభాగంలో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. 2024లో విడుదలైన '35 - చిన్న కథ కాదు' చిత్రంలో నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రలు పోషించారు. నందకిశోర్ ఈమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సృజన యర్రబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. విడుదల సమయంలో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు జాతీయ చలనచిత్ర పురస్కారాల్లోనూ తన సత్తా చాటింది. ఈ సందర్భంగా '35 - చిన్న కథ కాదు' స్కీన్…

Read more

‘కర్మాఖ్య’ ట్రైలర్ అద్భుతంగా ఉంది: విజయశాంతి

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ 'కర్మాఖ్య'. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 31న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు లేడి సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్య అతిథి హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఈ సినిమా టైటిల్ నాకు చాలా నచ్చింది. మొదట 'కామాఖ్య' అనే టైటిల్ చెప్పినప్పుడు చాలా…

Read more

‘మారెమ్మ’ సెప్టెంబర్ 10న గ్రాండ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర నిర్మాతలు సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10, 2026న థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. కొత్తగా విడుదలైన పోస్టర్‌లో మాధవ్ యుద్ధంలో పోరాడి వచ్చినట్టుగా ఇంటెన్స్ అవతార్‌లో ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్‌లో ఆయన పాత్రలోని రా ఇంటెన్సిటీతో పాటు భావోద్వేగాలను బలంగా చూపించారు. హీరోకు, పవిత్రమైన ఆవుకు మధ్య కనిపించే పేస్ అఫ్, ఈ సినిమా కథా నేపథ్యాన్ని ఆసక్తికరంగా ప్రజెంట్ చేస్తోంది. మారెమ్మ చిత్రంతో మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ…

Read more

‘రంభ ఊర్వశి మేనక’ నుంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్ రిలీజ్

గత కొన్నేళ్లుగా విభిన్న పాత్రలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్, ఇప్పుడు తన మార్క్ కామెడీ జోనర్‌ 'రంభ ఊర్వశి మేనక'తో సిద్ధమయ్యారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ ను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "Comedy Goes Cosmic" అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమా అల్లరి నరేష్ మార్క్ వినోదంతో మేళవించిన వినూత్న కథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుడుతూ మేకర్స్ తొలి పాట 'నా కంటి మీద కునుకే'ను విడుదల చేశారు. అల్లరి నరేష్, సురభిపై చిత్రీకరించిన ఈ పాట…

Read more

‘ది ఇండియా స్టోరీ’ కొత్త పోస్టర్ రిలీజ్

కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'ది ఇండియా స్టోరీ' నుంచి మేకర్స్ మరో పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దేశంలో అత్యంత ఆందోళన కలిగిస్తున్న పెస్టిసైడ్ వ్యవసాయం అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్న ఈ పోస్టర్, సినిమా చెప్పబోయే బలమైన సందేశాన్ని మరోసారి హైలైట్ చేస్తోంది. మనం ప్రతిరోజూ తినే ఆహారం వెనుక దాగి ఉన్న ప్రమాదాలను ఆలోచింపజేసేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. కొత్తగా విడుదలైన పోస్టర్‌లో పెస్టిసైడ్స్ అధికంగా ఉపయోగించడం వల్ల ఆహార భద్రత, ప్రజారోగ్యంపై పడుతున్న ప్రభావాన్ని బలంగా చూపించారు. ఆలోచింపజేసే విజువల్ డిజైన్‌తో రూపొందిన ఈ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. సమాజానికి ఎంతో కీలకమైన అంశాన్ని ఎమోషనల్, థ్రిల్లింగ్ కథతో ప్రేక్షకుల…

Read more

NBK111 షూటింగ్‌ లో బాలకృష్ణ కి స్వల్ప గాయం

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణకు స్వల్ప గాయమైయింది. బాలయ్య హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో #NBK111 రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం కాకినాడలో జరుగుతోంది. ఓ కీలక యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తుండగా బాలకృష్ణ గారికి చిన్న మసిల్ టియర్ అయింది. ఈ విషయాన్ని దర్శకుడు గోపిచంద్ మలినేని సోషల్ మీడియా ద్వారా తెలిజేశారు. ''#NBK111 షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ లో నందమూరి బాలకృష్ణ గారికి చిన్న మసిల్ టియర్ అయింది. వైద్యుల సూచన మేరకు, ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి ఉంది. సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం #NBK111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో…

Read more

‘హాయ్’ ఆగస్టు 14న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్

లేడీ సూపర్ స్టార్ నయనతార, యువ హీరో కవిన్ తొలిసారి జంటగా నటిస్తున్న 'హాయ్' విడుదల తేదీని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేస్తూ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. నూతన దర్శకుడు విష్ణు ఎడ్విన్ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో కె. భాగ్యరాజ్, ప్రభు, రాధిక శరత్‌కుమార్, వీటీవీ గణేష్, సత్యన్, ఆదిత్య కదిర్, ఖురేషి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజేష్ శుక్లా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జెన్ మార్టిన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, ఎస్. కన్నన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో…

Read more