Skip to content

‘#CULT’ నుంచి ఫస్ట్ సింగిల్ ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ మరోసారి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. తన కెరీర్‌లో ఎప్పటికప్పుడు విభిన్న కథలతో ముందుకొచ్చే ఆయన ఇప్పుడు #CULT తో పూర్తిగా కొత్త జానర్‌లో రాబోతున్నారు. విశ్వక్‌సేన్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రాన్ని సందీప్ కాకరాల తారక్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భారతదేశపు తొలి ఆథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా, నిజ జీవితంలోని భయానక సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది, ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించబోతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీ ఆసక్తిని నెలకొల్పింది. ఆ ఆసక్తిని మరింత పెంచుతూ తాజాగా చిత్ర బృందం తొలి పాట 'హీ ఈజ్ మై దోస్తీ' ని విడుదల చేసింది…

Read more

‘418’ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక హారర్ థ్రిల్లర్ '418' విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కీర్తన్ నడగౌడ కథ, దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న '418', హారర్ త్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టేలా సరికొత్త హారర్ అనుభూతిని అందించబోతోంది…

Read more

‘కామ్రేడ్ కళ్యాణ్’ నుంచి లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

టైటిల్ గ్లింప్స్, తొలి పాటతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన 'కామ్రేడ్ కళ్యాణ్' చిత్ర బృందం ఇప్పుడు రెండో పాట 'ఇంత ఇష్టమా' ను విడుదల చేసింది. శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో, వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ లవ్ మెలోడీ హీరో చూపించే నిస్వార్థమైన ప్రేమ, ఆప్యాయతకు హీరోయిన్ మెస్మరైజ్ అయ్యి అతనిపై ప్రేమను పెంచుకునే భావోద్వేగాలను అందంగా చూపించారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం ఈ లవ్ సాంగ్ మరింత అందాన్ని తీసుకురాగా, రామ్ మిర్యాల,…

Read more

న్యూఢిల్లీలో ఘనంగా ‘రామాయణ’ చిత్ర ‘ప్రథమ్ సంకల్ప్’ ఈవెంట్

భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప సాంస్కృతిక వారసత్వాల్లో రామాయణం ఒకటి. తరతరాలుగా ఇది కేవలం ఒక ఇతిహాసంగా మాత్రమే కాకుండా, భారతీయుల పండుగలు, విలువలు, జీవన విధానం, సంస్కృతిలో విడదీయరాని భాగంగా కొనసాగుతోంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజంలోనూ రామాయణం తన ప్రభావాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు ఆ శాశ్వత గాథ మరో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్ విడుదలకు ముందు, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న 'రామాయణ' చిత్ర బృందం న్యూఢిల్లీలో ప్రత్యేకంగా తొలి ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. 'ప్రథమ్ సంకల్ప్' పేరుతో నిర్వహించిన ఈ వేడుక, 'భారత్ నుంచి ప్రపంచానికి రామాయణ ప్రయాణానికి' శ్రీకారంగా నిలిచింది. భారతీయ సంప్రదాయంలో 'సంకల్పం' అంటే ఒక…

Read more

‘ది ఇండియా స్టోరీ’ ట్రైలర్ రిలీజ్

'ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్' ట్రైలర్ విడుదలైంది. ఇది పురుగుమందుల సాగు అనే ఆందోళనకరమైన సమస్యను, సమాజంపై దాని ప్రభావాలను వెలుగులోకి తెస్తుంది. కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా, ప్రతి ఇంటిని ప్రభావితం చేస్తున్న కీలక సమస్యను ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన డ్రామా, పవర్ ఫుల్ నటన, సామాజిక సందేశంతో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ భాగస్వామ్యంతో తెరకెక్కిన ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహించారు. సాగర్ బి. షిండే కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు…

Read more

‘న్యూటన్స్ థర్డ్ లా’ చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే థ్రిల్లర్: సుమంత్

సుమంత్‌ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్‌ ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’. రాజేశ్‌ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ధమ్ ధమ్ సాంగ్ లాంచ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుమంత్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. 'న్యూటన్స్ థర్డ్ లా' కథను ఒకే సిట్టింగ్‌లో ఓకే చేశాను. 'అనగనగా' తర్వాత ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కథ విన్న వెంటనే వినయ్ పాత్ర, కార్తీక్ పాత్ర చాలా బలంగా ఉండాలని చెప్పాను. ఆ రెండు పాత్రలు అద్భుతంగా ఉంటేనే సినిమా ఆడుతుందని అప్పుడే అనుకున్నాను. నిజంగానే ఇద్దరూ అద్భుతంగా…

Read more

‘ఓ.! సుకుమారి’ కు అద్భుతమైన స్పందన రావడం ఆనందం: హీరో తిరువీర్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఓ.! సుకుమారి'. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు. జూలై 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు. థాంక్ యూ మీట్ లో హీరో తిరువీర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరు చూపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు. నిజానికి నా సినిమాలకు ఒక్కో షోకి రెస్పాన్స్ పెరుగుతూ ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ షోల వరకు ప్రేక్షకుల స్పందన…

Read more

‘మహేంద్రగిరి వారాహి’ చిత్రం వారాహి అమ్మవారి, ప్రేక్షకుల ఆశీస్సులతో ఘనవిజయం సాధించాలి: హీరో సుమంత్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లోని మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో చిత్ర బృందం వారాహి అమ్మవారి…

Read more

#KJQ (కింగ్ జాకీ క్వీన్) ఆగస్టు 7న రిలీజ్

విభిన్న కథాంశాలతో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాలను అందుకుంటున్న నిర్మాత సుధాకర్ చెరుకూరికి తన ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ నుంచి మరో ఆసక్తికరమైన చిత్రం #KJQ – King Jackie Queen ప్రేక్షకుల ముందుకు రానుంది. 1990ల కాలం నేపథ్యంలో సాగే పీరియడ్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో 'దసరా', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా నూతన నటి శశి ఓదెల పరిచయం అవుతుండగా, యుక్తి తరేజా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కేకే గత ఏడాది కన్నుమూశారు. ఆయన సినిమాపై ఉన్న పాషన్, విజన్ కి నివాళిగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు…

Read more

‘పళ్ళబురుసు’ అనౌన్స్‌మెంట్- 2026 ఆగస్టు14న గ్రాండ్ రిలీజ్

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రం 'పళ్ళబురుసు'ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే ఈ చిత్రం వినోదభరితమైన కామెడీ-డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రజ్వల్ , గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జిల్లా కోర్టు ఆవరణలో పెద్ద టూత్‌బ్రష్‌ను త్రాసులా…

Read more