Skip to content

‘ఓ.! సుకుమారి’ వినోదం, ఎమోషన్స్‌తో కూడిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: హీరో తిరువీర్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో తిరువీర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నుంచి వరుసగా సినిమాలు విడుదల కావడం ఎలా అనిపిస్తోంది?…

Read more

‘మహాకాళి’ 125 రోజుల షూటింగ్ పూర్తి

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'మహాకాళి' చివరి దశ చిత్రీకరణలోకి అడుగుపెట్టింది. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ మైథాలజికల్ ఎపిక్‌కు ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విజయవంతంగా 125 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరిస్తున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక షూటింగ్‌లో మరో కీలక మైలురాయిని కూడా ఈ చిత్రం చేరుకుంది. ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్న రోహిత్ సరాఫ్ తన పాత్రకు…

Read more

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే సినిమా: హీరో శ్రీకాంత్

శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు వివి వినాయక్, దశరథ్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ముందుగా పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వక…

Read more

ప్రభాస్ లాంచ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’ టీజర్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు'తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్ ఆసక్తిని రేకెత్తించగా, ఫస్ట్ సింగిల్ 'కంసంనిద' చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈరోజు రెబెల్ స్టార్ ప్రభాస్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ప్రారంభంలో కనకరాజు వాయిస్ ఓవర్‌తో తన రాయలసీమలోని పెనుకొండ ఊరిని పరిచయం చేస్తాడు. అల్లరి, సరదాగా తిరిగే కనకరాజు జీవితం ఓ కొరియన్ అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఊహించని మలుపు తిరుగుతుంది. ఇదే సమయంలో…

Read more

‘రాజా ది రాజా’ అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్: నిర్మాత కె. నిహారిక దాసరి

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన 'రాజా ది రాజా' చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ప్రేమ, వినోదం, యూత్ కు సంబంధించిన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకోనుంది. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా భారీ స్థాయిలో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత కె. నిహారిక దాసరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. నిర్మాతగా మారాలనే నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది? నిర్మాతగా మారడానికి నాలుగైదేళ్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను…

Read more

‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ చూసి మహేష్ బాబు గారు అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు: హీరో జై కృష్ణ ఘట్టమనేని

అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ చందమామ కథలు బ్యానర్ నిర్మాణంలో జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, అజయ్ భూపతి 'శ్రీనివాస మంగాపురం' లవ్, ఇంటెన్స్ ఎమోషన్స్, పవర్ ఫుల్ యాక్షన్ థియేట్రికల్ ట్రైలర్‌ లాంచ్ సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని 'శ్రీనివాస మంగాపురం' చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని ఈ చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తోంది. సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించి, అశ్విని దత్ సమర్పిస్తున్న…

Read more

లెజెండరీ సింగర్ శ్రీమతి ఎస్. జానకి అమ్మగారు ఇక లేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. – నందమూరి బాలకృష్ణ

తన మధురమైన గళంతో దశాబ్దాల పాటు కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన జానకి అమ్మగారు ఇక లేరనే వార్త యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. మా నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి చిత్రాలతో పాటు.. నా చిత్రాల్లోనూ ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు ఎప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉంటాయి. మా కుటుంబంతో ఆమెకు ఎంతో దశాబ్దాల అనుబంధం ఉంది. తన అద్భుతమైన గాత్రంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర వేసిన జానకి అమ్మగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు మరియు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి! 🙏🏻

Read more

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు... ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి. జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం. ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో…

Read more

‘హ్యాపీ జర్నీ’ నుంచి బ్యూటీఫుల్ ఫస్ట్ సింగిల్ ‘ఆనందమే’ రిలీజ్

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, మహిళల భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ జర్నీ'. ఏడు మంది మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలను పోషించారు. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ల పై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న 'హ్యాపీ జర్నీ' చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్‌తో భారీ అంచనాలను రేకెత్తించిన చిత్ర బృందం, ఇప్పుడు 'ఆనందమే'…

Read more

ఓ.! సుకుమారి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సినిమా అద్భుతంగా వచ్చింది: నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. 'ఓ..! సుకుమారి' ఎలా ఉండబోతోంది? ఇది మంచి…

Read more