Skip to content
రవితేజ  ‘ఇరుముడి’ బ్యూటిఫుల్ వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ Telugu News

రవితేజ ‘ఇరుముడి’ బ్యూటిఫుల్ వర్కింగ్ స్టిల్స్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' చిత్రం కోసం దర్శకుడు శివ నిర్వాణ జతకట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి' గ్లింప్స్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ సెట్స్ నుంచి బ్యూటిఫుల్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేశారు. ఈ స్టిల్స్ రవితేజ, ప్రియా భవానీ శంకర్, శివ నిర్వాణ నేచురల్…

Read more
‘సింగ్ గీతం’ తొలి టికెట్ కొనుగోలు చేసిన ఎస్.ఎస్. రాజమౌళి Telugu News

‘సింగ్ గీతం’ తొలి టికెట్ కొనుగోలు చేసిన ఎస్.ఎస్. రాజమౌళి

థియేటర్లలోకి రాకముందే ‘సింగ్ గీతం’ కథ దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిపై బలమైన ముద్ర వేసింది. నిర్మాత నాగ్ అశ్విన్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తో జరిగిన ప్రత్యేక సంభాషణలో రాజమౌళి, లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు విజన్, అలాగే ఈ యూనిక్ మ్యూజికల్ ఫాంటసీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమా ఐడియా తాను తొలిసారిగా 1995-96 ప్రాంతంలో తన సోదరుడు ఎం.ఎం. కీరవాణి ద్వారా విన్నాను. అప్పటి నుంచి ఆ కాన్సెప్ట్ తన మదిలో నిలిచిపోయింది. “ఈ కథను మొదటిసారి విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అది పూర్తిగా కొత్తగా, ఎవరికీ తట్టని ఆలోచనగా అనిపించింది. ఇంత వినూత్నమైన, సాహసోపేతమైన కథను తెరపైకి తీసుకురావడానికి కూడా…

Read more
దర్శకుడు భారతీరాజా మృతి పట్ల చిరంజీవి సంతాపం Telugu News

దర్శకుడు భారతీరాజా మృతి పట్ల చిరంజీవి సంతాపం

దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘భారతీయ సినీ పరిశ్రమ ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయింది. గ్రామీణ మట్టి పరిమళాన్ని, మానవ సంబంధాల అందాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను ఆయన తన సినిమాల ద్వారా శాశ్వతమైన సినీ కవిత్వంగా మలిచి మనకి అందించారు. ఆయన చిత్రాలు లక్షలాది ప్రేక్షకుల హృదయాలను తాకడమే కాకుండా తరతరాల సినీ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయి. పద్మశ్రీతో పాటు పలు జాతీయ పురస్కారాలను అందుకున్న భారతీరాజా గారు, భారతీయ సినిమాకు చేసిన సేవలు వెలకట్టలేనివి. ‘ఆరాధన’ చిత్రంలో ‘పులిరాజు’ పాత్రలో ఆయన దర్శకత్వంలో పనిచేసే అదృష్టం…

Read more
‘సింగ్ గీతం’ విడుదల తేదీలో ఒక రోజు మార్పు జూన్ 12న రిలీజ్ Telugu News

‘సింగ్ గీతం’ విడుదల తేదీలో ఒక రోజు మార్పు జూన్ 12న రిలీజ్

చాలా మంది ఫిల్మ్ మేకర్స్ సినిమా విడుదల అనేది ఒక ముగింపు ఘట్టం. అయితే లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ నాగ్ అశ్విన్ లకు మాత్రం తాము ఊహించిన ప్రతి క్రియేటివ్ ఎలిమెంట్ తెరపై అత్యుత్తమంగా ఆవిష్కృతమయ్యేలా చూసుకోవడమే ముఖ్యం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సింగ్ గీతం’ చిత్రం తొలుత జూన్ 11న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు జూన్ 12కి వాయిదా పడింది. కథలో కీలక పాత్ర పోషించే కొన్ని ముఖ్యమైన సీజీఐ, విజువల్ ఎఫెక్ట్స్ పనులను మరింత మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ‘సింగ్ గీతం’ ఒక ఫాంటసీ, సూపర్‌నేచురల్ ప్రపంచాన్ని ఆవిష్కరించే చిత్రం. ఇందులో సంగీతంతో పాటు విజువల్స్ కూడా కథనంలో…

Read more
హీరో సాయి దుర్గా తేజ్, SYG (సంబరాల ఏటిగట్టు) ముంబై షెడ్యూల్ పూర్తి Telugu News

హీరో సాయి దుర్గా తేజ్, SYG (సంబరాల ఏటిగట్టు) ముంబై షెడ్యూల్ పూర్తి

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్-ఇండియా స్పెక్టికల్ SYG (సంబరాల ఏటిగట్టు) తో ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. హనుమాన్ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #SYGపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. రోహిత్ కె.పీ దర్శకత్వంలో, నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన ముంబై షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు పాల్గొనడం చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. హనుమాన్ విజయంతో భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్, #SYGతో మరింత భారీగా నిర్మిస్తోంది. ఇప్పటికే పూర్తైన ప్రతి షెడ్యూల్…

Read more
‘అనుమాన పక్షి’ హిలేరియస్ ఫన్ రైడ్ టీజర్ రిలీజ్ Telugu News

‘అనుమాన పక్షి’ హిలేరియస్ ఫన్ రైడ్ టీజర్ రిలీజ్

'DJ టిల్లు'తో సంచలన విజయాన్ని అందుకున్న రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ, మరో విభిన్నమైన వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసారి ఆయన 'చిలక ప్రొడక్షన్స్' బ్యానర్‌పై 'అనుమాన పక్షి' అనే యునిక్ కామెడీ చిత్రం కోసం యంగ్ హీరో రాగ్ మయూర్‌తో జతకట్టారు. రాజీవ్ చిలక, రాజేష్ జగతియాని, హీరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటిస్తున్నారు. రమణ గోగుల ఆలపించిన ఈ చిత్రంలోని మొదటి పాట 'గులాబ్ జామ్' ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌లో రాగ్ మయూర్ పోషించిన పాత్రను పరిచయం చేశారు. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ,…

Read more
అతి తక్కువ సమయంలో 5 మిలియన్+ వ్యూస్ క్రాస్ చేసిన “సిగ్మా” ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ Telugu News

అతి తక్కువ సమయంలో 5 మిలియన్+ వ్యూస్ క్రాస్ చేసిన “సిగ్మా” ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న ‘సిగ్మా’ చిత్రం ప్రకటించిన నాటి నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘సిగ్మా స్టైల్’ సాంగ్ అతి తక్కువ సమయంలోనే 5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సంగీత ప్రియులు, యువత నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఈ పాట తెలుగు, తమిళ ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఎనర్జీతో నిండిన బీట్, స్టైలిష్ విజువల్స్, గ్రాండ్ ప్రెజెంటేషన్‌తో ‘సిగ్మా స్టైల్’ పాట ప్రేక్షకులను వెంటనే…

Read more
నిజాయితీగా పని చేస్తే సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ‘పెద్ది’ నిరూపించింది: రామ్ చరణ్ Telugu News

నిజాయితీగా పని చేస్తే సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ‘పెద్ది’ నిరూపించింది: రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘థాంక్ యూ’ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ... ప్రేక్షకులు, అభిమానులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్యూ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఇష్టపడి, ప్రేమిస్తూ ఒక పని చేస్తూ…

Read more
‘భోళా బాలయ్య’ సాంగ్ అద్భుతంగా ఉంది. బాలయ్య బాబుగారి పుట్టినరోజు ఓ పండగ:  బోయపాటి శ్రీను Telugu News

‘భోళా బాలయ్య’ సాంగ్ అద్భుతంగా ఉంది. బాలయ్య బాబుగారి పుట్టినరోజు ఓ పండగ: బోయపాటి శ్రీను

బాలయ్య బాబుగారిని ప్రేమిస్తే నో బ్రేకప్స్... ఆ ప్రేమ జీవితాంతం ఉంటుంది: ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు అనంతపురం జగన్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు(జూన్ 10) వేడుకలు సందర్భంగా రూపొందించిన "భోళా బాలయ్య" సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా హాజరై వేడుకకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చారు. అభిమానుల సందడి మధ్య ఈ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. భోళా బాలయ్య సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. బాలయ్య గారు ఏంటనేది నేను నా సినిమాల ద్వారా చెప్పాను. ఈ సాంగ్ గురించి చెప్పాలంటే, పాట చాలా…

Read more
హైదరాబాద్ నుంచి వారణాసి వరకు ‘నాగబంధం’ అద్భుత ప్రచార యాత్ర Telugu News

హైదరాబాద్ నుంచి వారణాసి వరకు ‘నాగబంధం’ అద్భుత ప్రచార యాత్ర

అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్' చిత్రాన్ని దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిపేందుకు చిత్రబృందం విస్తృత స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్నారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం మేకర్స్ దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రమోషనల్ టూర్‌ను ప్రకటించారు. సాధారణ ప్రమోషన్స్‌కు భిన్నంగా, సినిమా కథలోని ట్రెజర్ హంట్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఈ ప్రచార యాత్రను రూపొందించారు. ప్రతి నగరంలో జరిగే కార్యక్రమం ద్వారా సినిమా ప్రపంచం, అందులోని రహస్యాలు, సాహస అంశాలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయనున్నారు. ఈ టూర్‌లో తొలి…

Read more