Skip to content

‘దొంగ నా కొడుకు’ ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పెద్ద స్టార్ హీరోలతో గ్రాండ్ ఎంటర్‌టైనర్స్ చేస్తూనే, మరోవైపు కొత్త టాలెంట్‌తో కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మిస్తోంది. తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. 'లిటిల్ హార్ట్స్' చిత్రంతో ప్రశంసలు అందుకున్న మౌళి తనూజ్ ప్రసాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా 'దొంగ నా కొడుకు' అనే క్రేజీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. 'దొంగ నా కొడుకు' అనే టైటిల్ వినగానే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వినూత్నంగా డిజైన్ చేసిన లోగో సినిమా ఫన్, ఎంటర్‌టైనింగ్ టోన్‌ను పరిచయం చేస్తోంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌లో…

Read more

‘ఇరుముడి’ నుంచి బ్యూటీఫుల్ హోమ్లీ సాంగ్ ‘యాలాలో యాలాలో’ రిలీజ్

మాస్ మహారాజా మోస్ట్ ఎవైటెడ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఇరుముడి' ప్రమోషన్స్ తో ఉత్సాహాన్ని పెంచుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, తన భక్తి గీతమైన మొదటి పాట 'ఇరుముడి కట్టు'తో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే జోరును కొనసాగిస్తూ, కుటుంబ బంధాలలోని ఆప్యాయతను అందంగా చాటిచెప్పే రెండవ పాట 'యాలాలో యాలాలో'ను చిత్ర బృందం విడుదల చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు ఆయన అందించిన సాఫ్ట్ మెలోడీ, ఆర్కెస్ట్రేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం మధ్యతరగతి కుటుంబంలోని ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలే అసలైన సంపద అనే భావాన్ని హృదయానికి హత్తుకునేలా చెబుతుంది. హెషామ్ అబ్దుల్ వహాబ్,…

Read more

కార్తి, మోహన్ రాజా, ఎస్. లక్ష్మణ్ కుమార్, ప్రిన్స్ పిక్చర్స్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్

ప్రిన్స్ పిక్చర్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. హీరో కార్తీ, ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్‌లో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం కుటుంబ భావోద్వేగాలతో పాటు హీరోయిజాన్ని అద్భుతంగా మేళవించిన ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. కార్తీ, మోహన్ రాజా కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌లో కార్తీకి ఇది వరుసగా నాలుగో చిత్రం. ఇంతకుముందు 'దేవ్', 'సర్దార్', 'సర్దార్ 2' చిత్రాల తర్వాత మరోసారి ఈ బ్యానర్‌తో ఆయన చేతులు కలపడం విశేషం. ముఖ్యంగా 'సర్దార్ 2' విడుదలకంటే ముందే ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించడం కార్తీ, ప్రిన్స్ పిక్చర్స్ మధ్య ఉన్న బలమైన అనుబంధానికి నిదర్శనం. ఈ సినిమాపై…

Read more

‘#KJQ’ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన పీరియడ్ క్రైమ్ డ్రామా #KJQ (కింగ్ - జాకీ - క్వీన్). 1990ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో 'దసరా', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాలతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. వీరితో పాటు నూతన నటుడు శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది కన్నుమూసిన దర్శకుడు KK(కిరణ్ )కి ఇది చివరి చిత్రం. ఆయన క్రియేటివిటీ, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది ఒక నివాళిగా నిలుస్తుంది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది…

Read more

‘ఎల్లమ్మ’ నుంచి పర్షిగా దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ రిలీజ్

విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకున్న 'బలగం' చిత్రం తర్వాత, జాతీయ అవార్డు గ్రహీత వేణు యెల్దండి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఎల్లమ్మ' సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, బలమైన భావోద్వేగాలను, సాంస్కృతిక నేపథ్యాన్ని మిళితం చేస్తూ సాగుతుంది. 'రాక్‌స్టార్' దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించడంతో పాటు హీరోగా పరిచయమౌతున్నారు. ఇది DSP కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుంది. అందరినీ సర్ప్రైజ్ చేస్తూ 'ఎల్లమ్మ' చిత్ర బృందం ఈ రోజు 'పర్షి'గా దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. DSP పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్, ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ…

Read more

‘కింగ్ 100’ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్

కింగ్ నాగార్జున అక్కినేని మైల్ స్టోన్ 100వ పై చిత్రంపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకులలో ఒకరైన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా అధికారికంగా చేరారు. ఆదివారం డీఎస్పీ 47వ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్రత్యేక బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేసి ఆయనకు 'కింగ్ 100' టీమ్‌లో ఘన స్వాగతం పలికారు. నాగార్జున - దేవిశ్రీ ప్రసాద్ లది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. నాగార్జున 'మన్మథుడు', 'మాస్', 'కింగ్', 'కుబేర' చిత్రాలకు డీఎస్పీ అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మైలురాయి చిత్రానికి…

Read more

‘శ్రీ శ్రీ’ ఫారిన్ షూటింగ్ షెడ్యూల్‌ పూర్తి

వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ శ్రీ శ్రీ బిజీగా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ (#SLV10) మైల్ స్టోన్ చిత్రంగా నిలుస్తోంది. ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్, తొలి పాట 'బొమ్మ బొమ్మ'కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఫారిన్ షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి…

Read more

శ్రీనివాస మంగాపురం తో జై కృష్ణ హీరోగా సక్సెస్ అయ్యాడు: ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

-శ్రీనివాస మంగాపురం సినిమాకు, నా పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు: హీరో జై కృష్ణ ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని బ్లాక్ బస్టర్ మూవీ 'శ్రీనివాస మంగాపురం' తో హీరోగా పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పించారు. నిర్మాత పి. కిరణ్ నిర్మించారు. రాషా తడాని హీరోయిన్ గా పరిచయమైయింది. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయం అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్…

Read more

‘రామాయణ’ ట్రైలర్ కు రెండు రోజుల్లోనే 350+ మిలియన్ల వ్యూస్‌

రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా, నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ: పార్ట్ 1' ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే అధికారిక ప్లాట్‌ఫార్మ్‌లలో 350 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందనతో ఈ చిత్రం 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ట్రైలర్‌కు సినీ అభిమానులు, విమర్శకులు, సెలబ్రిటీలు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా భారీ స్థాయి విజువల్స్, వరల్డ్ క్లాస్ VFX, భావోద్వేగభరితమైన కథనం, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా "Our Truth. Our History." అనే…

Read more

కింగ్ – జాకీ – క్వీన్ నుంచి నువ్వే తోపు సాంగ్ రిలీజ్

సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన పీరియడ్ క్రైమ్ డ్రామా #KJQ (కింగ్ - జాకీ - క్వీన్). 1990ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో 'దసరా', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాలతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. వీరితో పాటు నూతన నటుడు శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది కన్నుమూసిన దర్శకుడు KKకి ఇది చివరి చిత్రం. ఆయన క్రియేటివిటీ, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది ఒక నివాళిగా నిలుస్తుంది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది తాజాగా మేకర్స్ నువ్వే తోపు సాంగ్ రిలీజ్ రిలీజ్ చేశారు. పూర్ణచంద్ర…

Read more