Skip to content

‘నాగబంధం’ నుంచి ‘వీరనాగ’ సాంగ్ రిలీజ్

'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలను పెంచింది. దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నాగార్కర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ వీరనాగ సాంగ్ ని రిలీజ్ చేశారు. 'వీరనాగ' పాట నాగ సాధువుల ఆధ్యాత్మిక తాండవాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. శ్రీహర్ష ఈమని…

Read more

‘బిల్లా రంగ బాషా’ షూటింగ్ నేటి నుంచి తిరిగి ప్రారంభం- పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

సూపర్‌స్టార్ బాద్‌షా కిచ్చా సుదీప్ హీరోగా, విజనరీ అనుప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2209 AD ఫ్యుచర్ లో సెట్ చేయబడిన ఇంతకు ముందెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. గ్రాండ్ స్కేల్ లో బిల్లా రంగ బాషా భారతీయ సినిమా నుంచి సైన్స్ ఫిక్షన్ కథ చెప్పడంలో ఒక అడ్వంచర్ జర్నీని సూచిస్తోంది. బ్లాక్‌బస్టర్ హనుమాన్ మేకర్స్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాణంలో అద్భుతమైన స్టార్ పవర్, టెక్నికల్ వాల్యూస్ లో ఈ సినిమా న్యూ బెంచ్ మార్క్ ని క్రియేట్ చేయనుంది. ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. 'నిరీక్షణకు తెరపడింది... యుద్ధం మొదలవుతోంది' అని…

Read more

‘ది ఇండియా స్టోరీ’ హార్డ్ హిట్టింగ్ టీజర్ రిలీజ్

కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పురుగుమందుల ఆధారిత వ్యవసాయం (పెస్టిసైడ్ ఫార్మింగ్) వల్ల సమాజంపై పడుతున్న తీవ్ర ప్రభావాన్ని ఈ చిత్రం ప్రధానాంశంగా తీసుకుంది. రోజూ కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న ఈ సమస్యపై అవగాహన కల్పించడమే ఈ సినిమా లక్ష్యం. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్‌తో కలిసి రూపొందుతున్న ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. సాగర్ బి. షిండే కథ, నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. టీజర్‌లో…

Read more

‘రావు బహదూర్’ సినిమా చూసిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశసంలు

సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్'ను, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ తమ 'GMB ఎంటర్‌టైన్‌మెంట్' బ్యానర్‌పై, A+S మూవీస్ , శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా రచన, ఎడిటింగ్, దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్లింప్స్, టీజర్, పాటలు ఇప్పటికే సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేశాయి ఈ కథను మొదటిసారి విన్నప్పటి నుండే మహేష్ బాబు 'రావు బహదూర్' పట్ల ఎంతో ఆసక్తిని, ఎమోషనల్ ఎటాచ్మెంట్ ని పెంచుకున్నారు. కేవలం సమర్పకుడిగానే కాకుండా, సినిమా ఆలోచన దశ నుండి పూర్తయ్యే వరకు దాని క్రియేటివ్ ప్రయాణాన్ని ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత ఆయన…

Read more

‘రాజా ది రాజా’ నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ ఊహలే సాంగ్ రిలీజ్

యూత్‌ఫుల్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ‘రాజా ది రాజా’ చిత్రం మూవీ లవర్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు అనిల్ బోయిడపు దర్శకత్వం వహిస్తున్నారు. వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ సెకండ్ సింగిల్ ఊహలే రిలీజ్ చేశారు. మార్క్ కె రాబిన్ ఈ సాంగ్ ని బ్యూటీఫుల్ లవ్ సాంగ్ గా కంపోజ్ చేశారు. కృష్ణకాంత్ (కేకే) రాసిన హృదయాన్ని తాకే సాహిత్యం మరింత అందాన్ని…

Read more

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా వీరేష్ కోకా దర్శకత్వంలో సురవి విజన్స్ ప్రొడక్షన్ నెం1 ఘనంగా ప్రారంభం

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా పరిచయం అవుతున్నారు. వీరేష్ కోకా దర్శకత్వంలో సురవి విజన్స్ బ్యానర్ పై పి చక్రధర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైయింది. ముహుర్తపు సన్నివేశానికి డైరెక్టర్ డాలీ క్లాప్ కొట్టి గౌరవ దర్శకత్వం వహించారు. గంటా రవితేజ కెమరా స్విచ్ ఆన్ చేశారు. నల్లమలుపు బుజ్జి మేకర్స్ కి స్క్రిప్ట్ అందించారు. పలువురు సినీ ప్రముఖులు, చిత్ర బృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో దివ్యాని మొండల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. S చంద్రశేఖరన్ డీవోపీ గా, బిబిన్ అశోక్ సంగీత…

Read more

‘నేను రెడీ’- బర్త్ డే స్పెషల్ పోస్టర్‌లో స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్న హవిష్

కమర్షియల్ హిట్స్ అందించిన దర్శకుడు త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో, యంగ్ హీరో హవిష్ భారీ ఎంటర్‌టైనర్ 'నేను రెడీ' కోసం సిద్ధమవుతున్నారు. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ నటిస్తోంది. కామెడీ, వినోదం, మాస్ అంశాల కలయికతో ఈ సినిమా రూపొందుతోంది. హవిష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హవిష్ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఒక వేర్‌హౌస్ సెట్టింగ్‌లో కూర్చుని ఉన్న హవిష్ తన ప్రజెన్స్ కట్టిపడేశాడు. అతని ట్రెండీ లుక్ అతని పాత్రపై ఆసక్తిని పెంచుతున్నాయి. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామరస్ నటనతో బాలీవుడ్‌లో…

Read more

#NBK112- మంత్రి నారా లోకేష్ క్లాప్, తేజస్విని గౌరవ దర్శకత్వంతో అత్యంత ఘనంగా ప్రారంభం

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ కలయికలో రాబోతున్న చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, అమరావతిలో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ ప్రముఖులు సురేష్ బాబు, గోపీచంద్ మలినేని, వెంకట సతీష్ కిలారు, సాహు గారపాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. కందుల దుర్గేష్ కెమెరాను స్విచ్ ఆన్ చేయగా, నారా లోకేష్ క్లాప్…

Read more
‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ లాంచ్- జూలై 2 నుంచి  నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ Telugu News

‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ లాంచ్- జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తన తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్‌ను విడుదల చేసింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వినోదాత్మక కథలో సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు చిల్లుకూరి రావు అనే టీచర్ పాత్రలో సందీప్ కిషన్ ఆకట్టుకున్నారు. ఎలాంటి ఉపాధ్యాయుడూ వెళ్లాలని అనుకోని మాకిపూర్‌కు అతడికి పోస్టింగ్ వస్తుంది. కుటుంబం ముందు పరువు నిలబెట్టుకోవాలని భావించి అక్కడికి వెళ్లిన సుబ్బుకు ఊహించని విధంగా సెక్స్ ఎడ్యుకేషన్ బోధించే బాధ్యత అప్పగిస్తారు ఆ తర్వాత జరిగే సంఘటనలు, గ్రామస్తులతో ఏర్పడే…

Read more
రజనీకాంత్, కమల్ హాసన్  ‘ధర్మన్’  సినిమా ప్రారంభోత్సవం Telugu News

రజనీకాంత్, కమల్ హాసన్ ‘ధర్మన్’ సినిమా ప్రారంభోత్సవం

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త చిత్రం 'ధర్మన్' షూటింగ్‌ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) ఈ రోజు ప్రారంభించింది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ రోజు ఆవిష్కరించారు. ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. 'ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆపరేషన్ థియేటర్‌లో నిలబడి ఉన్న రజనీకాంత్, ఆపరేషన్ డ్రస్‌తో పాటు డార్క్ గ్లాసెస్ ధరించి కనిపించారు. చేతిలో రక్తపు మరకలు ఉన్న స్కాల్పెల్ పట్టుకుని చిరునవ్వుతో కనిపిస్తున్న ఆయన లుక్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో కమల్ హాసన్,…

Read more