#NBK111 సెప్టెంబర్ 6న టైటిల్ అనౌన్స్‌మెంట్
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని మోస్ట్ ఎవైటెడ్ మూవీ #NBK111 కోసం మరోసారి జతకట్టారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజున విడుదలైన "ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా" ఫస్ట్ గ్లింప్స్‌తో భారీ అంచనాలు రేకెత్తించింది. బాలయ్య పవర్ ఫుల్ అవతార్‌లో అదరగొట్టారు. #NBK111 నుంచి మరో పెద్ద అప్‌డేట్ రాబోతోంది. చిత్ర నిర్మాతలు సెప్టెంబర్ 6వ తేదీన టైటిల్, విడుదల తేదీని ప్రకటించనున్నారు. గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి ప్రేక్షకులు ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'వీర సింహారెడ్డి' వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ కావడంతో మరిన్ని…
