Skip to content

థియేటర్స్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం – ‘ఓ అందాల రాక్షసి’ హీరో షెరాజ్ మెహదీ

థియేటర్స్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం –  ‘ఓ అందాల రాక్షసి’ హీరో  షెరాజ్ మెహదీ Telugu News

▪️’ఓ అందాల రాక్షసి’ మూవీ హీరో, మూవీ మేకర్ షెరాజ్ మెహదీ ఆవేదన

▪️ రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వ‌లేదు
▪️ చిన్న సినిమాలను చంపేస్తున్న‌ మాఫియా
▪️ ఎక్కువ థియేటర్స్ లో వస్తేనే సినిమా ఓటీటీకి అర్హత దొరుకుతుంది
▪️ న్యాయం జరిగే వరకు నా పోరాటం కొనసాగుతుంది

హైదరాబాద్‌: తెలుగు సినిమా పరిశ్రమలో మాఫియా చిన్న సినిమాలను చంపేస్తోంద‌ని ‘ఓ అందాల రాక్షసి’ హీరో, మూవీ మేకర్ షెరాజ్ మెహదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రిలీజ్ కే కాదు, రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వ‌లేదని ఇవ్వడం లేదని, థియేటర్స్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యం అన్నారు. తెలుగు ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, “మంచి సినిమాలను కిల్ చేస్తున్నారు. చిన్న సినిమాలను చంపేస్తున్నారు. నైజాం ఏరియాలో ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు. ఇది వ్యూహత్మకంగా జరుగుతోంది” అని షెరాజ్ మెహదీ అన్నారు. ఈ విషయంపై లీగల్‌గా పోరాటం కొనసాగుతోందని తెలిపారు.

చిన్న సినిమాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, “ప్రపంచంలో ఎక్కడా లేని పరిస్థితి మన ఇండస్ట్రీలో ఉంది. బాలీవుడ్‌లో కూడా ఇలా ఉండదు” అని వ్యాఖ్యానించారు. సెన్సార్ బోర్డు నిబంధనలు చిన్న సినిమాలకు భారంగా మారుతున్నాయని, ADCC వంటి చార్జీలు కూడా నిర్మాతలను కుంగదీస్తున్నాయని తెలిపారు.

చిన్న సినిమాలకు థియేటర్లు, సరైన అవకాశాలు కల్పించకపోతే కొత్త ప్రతిభ ఎదగడం కష్టమవుతుందని, చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేసింది. చిన్న సినిమాలను కాపాడాలని, పరిశ్రమలో సమాన అవకాశాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని, ఇండస్ట్రీ పెద్దలను కోరారు

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.