Skip to content

విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్‌‌ను వివరించిన పద్మశ్రీ గ్రహీత, ఉజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్

విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్‌‌ను వివరించిన పద్మశ్రీ గ్రహీత, ఉజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ Telugu News

మహిళల అక్రమ రవాణా మీద, మహిళలను వ్యభిచార కూపంలోంచి బయటకు తీసుకు వచ్చేందుకు ప్రజ్వల సంస్థ పోరాడుతూ వస్తోంది. ఈ మేరకు ప్రజ్వల సంస్థ ఫౌండర్, పద్మశ్రీ గ్రహీత సునీతా కృష్ణన్ తాజాగా మీడియా ముందుకు వచ్చి ‘విక్టిమ్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ చట్టం’ గురించి వివరించారు. అంతే కాకుండా తమ సంస్థ ద్వారా చేసిన పోరాటం, ఉద్యమం గురించి కూడా వివరించారు.

సునీతా కృష్ణన్ ఇంకా మాట్లాడుతూ.. ‘మేం ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటి వరకు 32, 400 మంది అమ్మాయిలని రెస్క్యూ చేశాం. అయితే వీరిలో చాలా మంది ఈ సమాజం, పోలీసులు, ఇతర వ్యవస్థల ద్వారా మరింతగా బాధ పడుతూనే ఉన్నారు. ఇక్కడి బాధల్ని భరించలేక మళ్లీ తిరిగి ఆ అంధకారంలోకి వెళ్లారు. విక్టిమ్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ అనే చట్టం రావాలని మేం పోరాడం. గత 22 ఏళ్లుగా నిరంతరంగా పోరాటం చేస్తే గత వారం చరిత్రాత్మక తీర్పు వచ్చింది. అయితే ఈ తీర్పు పట్ల మీడియాకి కూడా సరిగ్గా అర్థం కాలేదు. మా పోరాటాన్ని అపహాస్యం చేసినట్టుగా అనిపిస్తోంది. అందుకే మేం ఈ చట్టం గురించి స్పష్టంగా చెప్పేందుకు మీడియా ముందుకు వచ్చామని ఆమె అన్నారు.

ఇప్పుడు ఇది విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్‌, పార్లమెంట్ ఆమోదించిన తరువాత చట్టంగా మారుతుంది. ఇందులో మూడు విషయాలు క్లియర్‌గా ఉంటాయి. ఆర్టికల్ 21, 23 ప్రకారం.. ప్రతీ ఒక్క బాధితురాలికి రిహాబిలిటేషన్ అనేది ప్రాథమిక హక్కు. బాధితురాలికి డిగ్నిటీ ఉండటం. అమ్మాయిని సరుకులా అమ్మకూడదు, గౌరవప్రదంగా, అర్థవంతంగా బతికేలా వనరులు కల్పించడం అనే అంశాలు ముఖ్యంగా ఉంటాయి. ప్రతీ దశలో అంటే పునరావాసం కావాలా? రిహాబిలిటేషన్ సెంటర్‌కి రావడం అంగీకారమేనా? ఇలా ప్రతీ సారి అమ్మాయి కన్సంట్ తీసుకోవాలి.

మన రాష్ట్రంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ (AHTU) యూనిట్ ఉంది. కానీ వీళ్లకి ఎలాంటి అధికారాలు ఉండవు. అయితే ఈ ప్రొటెక్షన్ ప్లాన్‌లో ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ఓ యూనిట్‌ను పెట్టమని ఉంటుంది. రెస్క్యూ నుంచి రీహాబిలిటేషన్ వరకు ప్రతీదీ అకౌంటబిలిటీ ఉండాలి. రెస్క్యూ సమయంలో పోలీసులు తప్పుగా బిహేవ్ చేస్తే కేసు కూడా ఫైల్ చేయవచ్చు. విక్టిమ్‌కి ఒక లాయర్ ఉండాలి, రైట్ టు లీగల్ రిప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. ఇది అడల్ట్ విక్తిం ఆఫ్ సెక్స్ ట్రాఫికింగ్ అని చెప్పుకోవచ్చు. బాధితురాలికి నష్టపరిహారం అనే తీర్పు ఇంత వరకు రాలేదు. ఇలాంటి ఓ తీర్పు రావడం దేశంలో ఇదే మొదటి సారి.

కోర్ట్ కొన్ని రికమండేషన్ కూడా చేసింది. అక్రమ రవాణా పైన సమగ్రమైన చట్టం తీసుకురావాలి. టెక్నాలజీ ద్వారా జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ ను అడ్డుకోవడానికి ఏం చెయ్యాలి అని ప్రభుత్వం ఆలోచించాలని చెప్పింది. వ్యభిచారం స్వేచ్చగా చేస్తున్న వారు.. బలవంతంగా చేస్తున్న వారున్నారు.. వీటి డెఫినిషన్ క్లియర్‌గా చెప్పాలని అన్నది. రెస్క్యూ ఆపరేషన్‌లో అందరిని బాధితురాలుగా చూడాలి.. నేరస్తులుగా చూడకూడదు’ అని అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.