Skip to content

‘రణబాలి’ నుంచి రశ్మిక బర్త్ డే స్పెషల్ వీడియో

‘రణబాలి’ నుంచి రశ్మిక బర్త్ డే స్పెషల్ వీడియో Telugu News

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ మూవీ “రణబాలి”. ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. “రణబాలి” సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు నేషనల్ క్రష్ రశ్మిక మందన్న బర్త్ డే సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు ఈ మూవీ మేకర్స్. ఈ వీడియోలో రశ్మిక ఎంత సహజంగా జయమ్మగా మారిపోయిందో చూపించారు. రణబాలి బలం జయమ్మ, అతని సంతోషాలకు కారణం జయమ్మ అంటూ ఈ వీడియోలో పేర్కొనడం ఈ జంట మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తోంది.

రణబాలి ఇటీవలే అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ, జయమ్మగా రశ్మిక మందన్న ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రణబాలి” సినిమా రూపొందుతోంది.

నటీనటులు – విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు

టెక్నికల్ టీమ్
—————–
బ్యానర్ – మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ – గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్
ప్రొడ్యూసర్స్ – నవీన్ యెర్నేని, రవిశంకర్
స్టోరీ, డైరెక్షన్ – రాహుల్ సంకృత్యన్
కో ప్రొడ్యూసర్స్- అనురాగ్ పర్వతనేని, శివ్ చనన
సీఈవో – చెర్రి
మ్యూజిక్ – అజయ్ – అతుల్
డీవోపీ – నీరవ్ షా
రైటర్ – ప్రమోద్ తమ్మినేని
ప్రొడక్షన్ డిజైనర్ – శివం రావు నాగసాని
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్ ఆర్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఆర్ చంద్రశేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చెంబోలు సాయ

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.