Skip to content

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల!

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల! Telugu News
మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల! Telugu News

నాన్‌స్టాప్ నవ్వులు పండించ‌డానికి టాలీవుడ్ తెర‌పైకి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్‌టైన్మెంట్ మూవీ రాబోతోంది. రాజీ నాయుడు – సీత‌మ్మ వాళ్లె ఆశీస్సుల‌తో రమణా ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై యువ నిర్మాత రమణ వాళ్లె నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం “ముసలోడికి దసరా పండుగ” విలక్షణ నటుడు నాజర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ శుక్ర‌వారం (మే 15న‌) థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ ప్ర‌చార చిత్రాల‌తో భారీ అంచ‌నాలు అందుకున్న ఈ సినిమాపై ఇండ‌స్ట్రీలో భారీ అంచ‌నాలు పెరుగుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా నిర్మాత రమణ వాళ్లె మాట్లాడుతూ.. “ప్రేక్షకులు థియేటర్‌కు వస్తే రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. సినిమా అవుట్‌పుట్ పట్ల మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సినిమా ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చుతుంద‌ని న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌లం. ఈ సినిమాను మా పితృ స‌మానులు దివంగ‌త ద‌ర్శ‌కుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌కు అంకిత‌మిస్తున్నాం” అని తెలిపారు.

చాలా కాలం త‌ర్వాత తెలుగు తెర‌పైకి ఫ్యామిలీ ఎమోషన్స్, ఫుల్ లెంగ్త్ కామెడీతో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

తారాగణం & సాంకేతిక నిపుణులు
ఈ సినిమాలో నాజర్‌తో పాటు అంజలి (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేం), అనిత (నువ్వు నేను ఫేం), కోవై సరళ, శరణ్య, సత్య వంటి భారీ తారాగణం నటిస్తున్నారు.

బ్యాన‌ర్: రమణా ఫిలిమ్స్
నిర్మాత‌: రమణ వాళ్లె
దర్శకత్వం: డి. మనోహర్
సంగీతం: డి. ఇమాన్
ప్రొడక్షన్ కంట్రోలర్: పానుగంటి సురేష్

సినిమాటోగ్రఫీ: వి. లక్ష్మీపతి
పీఆర్ఓ: అశోక్ దయ్యాల

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.