Skip to content

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ “సమవర్తి” మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ “సమవర్తి” మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి “సమవర్తి” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజు ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. “సమవర్తి” సినిమాను రుద్ర పిక్చర్స్ & పంచభూత ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్. వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

“సమవర్తి” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో సత్యదేవ్ చుట్టూ గొడ్డళ్లు, కత్తులతో కొందరు దూసుకురాగా, ఆయన ఎలాంటి భయం లేకుండా హెడ్ ఫోన్స్ లో పాటలు వింటూ ఇంటెన్స్ లుక్స్ లో కనిపిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది.

ప్రకృతి, అడవి వాతావరణాన్ని బలంగా ప్రతిబింబించిన ప్రీ-లుక్ పోస్టర్ తరువాత విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో, బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే పులి ద్వారా ప్రకృతికి సంబంధించిన సబ్‌టిల్ రిఫరెన్సెస్‌ను చేర్చి ఆసక్తిని మరింత పెంచారు.

సత్యదేవ్ కెరీర్ లో ఇదొక హై ఇంటెన్స్ యాక్షన్ మూవీ అవుతుందనే అంచనాలు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఏర్పడుతున్నాయి.

ప్రత్యేకంగా ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుతోంది.

ఈ చిత్రంతో సత్యదేవ్ పూర్తిగా కొత్త జోన్‌లోకి అడుగుపెడుతూ, ఫుల్-ఫ్లెడ్జ్డ్ యాక్షన్ స్పేస్ వైపు గేర్ మార్చారు.

నటీనటులు – సత్యదేవ్, దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గనవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————–
ఆర్ట్ డైరెక్టర్ – మొండ్రు రవికుమార్
కాస్ట్యూమ్ డిజైనర్ – ప్రియాంక రెబెకా శ్రీనివాస్
ప్రొడక్షన్ డిజైనర్ – ఉల్లాస్ హైదుర్
ఎడిటర్ – ఆదిత్య తివారి
డీవోపీ – హర్ష మల్లికార్జున, దేవ్ దీప్ గండికుండు
మ్యూజిక్ – సింజిత్ యెర్రమల్లి
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – వినయ్ రెడ్డి మామిడి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఉజ్వల్ బీఎం
ప్రొడ్యూసర్స్ – శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి
డైరెక్షన్ – అజయ్ నాగ్.వి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), వంశీ కాక

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.