హీరో మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్ పై జరిమానా అంటూ మీడియాలో వస్తున్న వార్త…
కృష్ణారెడ్డి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం : “స్పిరిట్ ఇస్ నాట్ వన్”… నిర్మాత నర్సమ్మ
“స్పిరిట్ ఇస్ నాట్ వన్” సినిమాపై కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలను చిత్ర యూనిట్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, వాస్తవాలకు విరుద్ధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని చిత్ర బృందం పేర్కొంది.
సినిమా నిర్మాణం, టైటిల్ మార్పు, బ్యానర్ మార్పు వంటి అంశాలన్నీ చట్టబద్ధంగా, సంబంధిత విధానాల ప్రకారమే జరిగాయని యూనిట్ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులో తన పాత్ర గురించి కృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొంది.
వ్యక్తిగత కారణాలు, ఆర్థిక లావాదేవీలు లేదా కుటుంబ విషయాలను సినిమాతో ముడిపెట్టి చిత్ర యూనిట్‌పై నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమని తెలిపింది. సినిమా విడుదలకు ముందు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వెనుక ఉద్దేశాలు ఏమిటో అర్థం కావడం లేదని యూనిట్ అభిప్రాయపడింది.
అవసరమైతే అన్ని ఆధారాలను సంబంధిత అధికారుల ముందు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని, తప్పుడు ఆరోపణల వల్ల చిత్ర యూనిట్ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించింది.
ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు ఏకపక్ష ఆరోపణలను నమ్మకుండా వాస్తవాలను పరిశీలించాలని “స్పిరిట్ ఇస్ నాట్ వన్” చిత్ర యూనిట్ విజ్ఞప్తి చేసింది.

