ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో అత్యంత ఘనంగా జరిగింది…
‘ఇరుముడి’ మీకు తెగ నచ్చేస్తుంది: మాస్ మహారాజా రవితేజ
-మాస్ మహారాజా రవి తేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ ‘ఇరుముడి’ చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ రిలీజ్- గూస్‌బంప్స్ తెప్పించేలా అదిరిపోయిన పాట
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆసక్తికరమైన గ్లింప్స్, మెలోడీతో పాటు ఎనర్జిటిక్ సాంగ్స్‌తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది.
‘ఇరుముడి’లోని భక్తి భావానికి మరింత ఎనర్జీని జోడిస్తూ మేకర్స్ మోస్ట్ అవైటెడ్ ‘మల్లెపూల పల్లకి’ పాటను విడుదల చేశారు. గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో లాంచ్ చేసిన ఈ పాట.. అందరికీ సుపరిచితమైన అయ్యప్ప భక్తి గీతానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది.
అయ్యప్ప భక్తుల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉన్న ఒరిజినల్ ‘మల్లెపూల పల్లకి’ పాటలోని భక్తి భావాన్ని అలాగే ఉంచుతూ.. ‘ఇరుముడి’ కోసం సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ దీనికి కొత్త మ్యూజికల్ టచ్ ఇచ్చారు. గ్రాండ్ ఆర్కెస్ట్రేషన్, పవర్‌ఫుల్ రిథమ్స్‌తో పాటను మరింత ఎనర్జిటిక్‌గా తీర్చిదిద్దారు.
పాట మొదలైన వెంటనే దాని పవర్‌ఫుల్ బీట్స్, డప్పు రిథమ్స్ ఆకట్టుకుంటాయి. సాంప్రదాయ భక్తి భావాన్ని, రవితేజ సినిమాల్లో ఉండే మాస్ ఎనర్జీని అద్భుతంగా కలిపారు. ఒరిజినల్ పాటకు తన ప్రత్యేకమైన గొంతుతో గుర్తింపు తెచ్చుకున్న డప్పు శ్రీను మరోసారి తన వాయిస్‌తో పాటకు రా, డివోషనల్ ఫీల్ తీసుకొచ్చారు.
అయ్యప్ప స్వామి భక్తుడి గెటప్‌లో కనిపించిన రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ప్రతి బీట్‌కు తగ్గట్టుగా వేసిన ఆయన డ్యాన్స్ మూవ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ పాటకు పక్కా మాస్ అప్పీల్‌ను తీసుకొచ్చాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా పాటకు మరింత బలం చేకూర్చింది. పెద్ద సంఖ్యలో భక్తులు, సింక్రనైజ్డ్ డ్యాన్స్ మూవ్స్, గ్రాండ్ విజువల్స్‌తో పాటను ఆకట్టుకునేలా తెరకెక్కించారు.
జీవీ ప్రకాష్ కుమార్ ఎనర్జిటిక్ అరేంజ్‌మెంట్, డప్పు శ్రీను పవర్‌ఫుల్ వోకల్స్, రవితేజ మాస్ ఎనర్జీ, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ.. ఈ నాలుగు కలిసి ‘మల్లెపూల పల్లకి’ పాటకు గూస్‌బంప్స్ తెప్పించే అనుభూతిని అందిస్తున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో భక్తి సన్నివేశాలకు ఈ పాట మరింత హై ఇంపాక్ట్ ఇచ్చే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైన్, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ . జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
‘మల్లెపూల పల్లకి’ పాటకు వచ్చిన బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో ‘ఇరుముడి’పై అంచనాలు మరింత పెరిగాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రవితేజ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం, మా ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, డీఓపీ విష్ణు శర్మ ఈ సినిమాను ఎంతో ఓన్ చేసుకుని పనిచేశారు. అందరూ తమ సొంత సినిమా అనుకుని పనిచేశారు. విష్ణు శర్మ ఎక్స్‌ట్రార్డినరీ కెమెరామెన్. నాకు, శివ నిర్వాణకు తోడుగా తను కూడా పరిగెత్తాడు. ఫెంటాస్టిక్ వర్క్ ఇచ్చాడు. తనతో మళ్లీ పని చేయాలని ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ సూపర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ సినిమా ఒక మంచి ఎమోషనల్ రైడ్. నేను చెప్పడం కంటే సినిమా చూసిన తర్వాత మీరే చెబుతారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. ప్రతి క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. స్వాసిక నటన చూస్తే మీకు భయమేస్తుంది. అంత అద్భుతంగా చేసింది. నిజంగా కొన్ని క్యారెక్టర్స్ మీ మైండ్‌లో ఉండిపోతాయి. ఆగస్టు 21న సినిమా చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఇందులో ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో మీరు ఒక డిఫరెంట్ సాయికుమార్ గారిని చూస్తారు. సినిమా గురించి చాలా మాట్లాడుకుంటారు. జీవీ ప్రకాష్ బ్రహ్మాండమైన పాటలు ఇచ్చారు. నక్షత్ర ఫ్యూచర్‌లో చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ మిమ్మల్ని టచ్ చేస్తాయి. సినిమాలో మీకు ప్రియా భవానీ శంకర్ కనిపించదు.. కేవలం కావేరి పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఒకటి రెండు మూడు సీన్లు ఉంటాయి.. వాటిలో ఎక్స్‌లెంట్‌గా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మా నిర్మాతలు రవి, నవీన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మా కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. భవిష్యత్‌లో ఇంకా సినిమాలు చేస్తాం. ఒక విషయం మాత్రం బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది. అందరూ థియేటర్లలో ఒక మంచి సినిమాను ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. ఒక డిఫరెంట్ రవితేజను చూడబోతున్నారు. మా డైరెక్టర్ శివ గురించి సక్సెస్ మీట్‌లో మాట్లాడుతాను. థాంక్యూ సో మచ్. జై సినిమా.
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘మల్లెపూల పల్లకి’ పాట వెనుక చాలా శ్రమ ఉంది. ఈ పాట ఒరిజినల్ కంపోజర్స్, సింగర్స్‌ను పిలిచి వాళ్లతోనే చేయించడం జరిగింది. ఈ పాట థియేటర్‌లో ఒక తాండవంలా ఉంటుంది. ఇండియన్ సినిమాలో చాలా థ్రిల్లర్స్ వచ్చాయి. కాకపోతే ఒక ఫ్యామిలీ డ్రామాను ఇంత ఇంటెన్స్ ఎమోషన్స్‌తో తెరకెక్కించిన సినిమా నేను చూడలేదు. ఇది నా గత సినిమాల్లాగా లైట్‌హార్టెడ్‌గా ఉంటుందని అనుకోవద్దు. చాలా సీరియస్‌గా ఉంటుంది, చాలా టెన్షన్ పెడుతుంది, చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. చివరి 40 నిమిషాలు మిమ్మల్ని ఒక ఇంటెన్స్ డ్రామాలో ముంచేస్తుంది. తెలుగు సినిమాల్లో వచ్చిన మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామా ఇది. సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఒక ఎక్స్‌ట్రార్డినరీ ఎమోషన్ ఉంటుంది. రవితేజ గారి సినిమాల్లో చాలా త్వరగా షూటింగ్ పూర్తవుతుంది. ఎందుకంటే ఆయన గ్యాప్ తీసుకోరు, ఎవరికీ గ్యాప్ ఇవ్వరు. సీలేరులో అన్ని రియల్ లొకేషన్స్‌లో ఈ సినిమాను తెరకెక్కించాం. రవితేజ గారు, ప్రియా భవానీ శంకర్, సాయికుమార్ గారు అందరూ ఈ కథను నమ్మి పనిచేశారు. రవితేజ లాంటి అద్భుతమైన పెర్ఫార్మర్‌తో ‘ఇరుముడి’ సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. రవితేజ గారి పెర్ఫార్మెన్స్‌ను మరోసారి చూడాలనిపించేలా ఈ సినిమా ఒక ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌లా ఉంటుంది. ప్రియాకు ఇందులో మూడు సీన్లు ఉన్నాయి. అవి ఎంత అద్భుతంగా ఉంటాయో మీరు థియేటర్‌లో చూస్తారు. సాయికుమార్ గారు తన పాత్రలో పూర్తిగా ఇమిడిపోయారు. ఇంకా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నక్షత్ర అద్భుతంగా నటించింది. తన పెర్ఫార్మెన్స్ చూస్తే కన్నీళ్లు వస్తాయి. రవితేజ గారికి, నక్షత్రకు మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అలాగే అజయ్ ఘోష్ గారు కూడా చాలా మంచి పాత్ర చేశారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే జీవీ ప్రకాష్ కుమార్ గారి సంగీతాన్ని ఇష్టపడుతున్నాను. ఈ సినిమాకు ఆయన అద్భుతమైన మ్యూజిక్ చేశారు. ఆయన మ్యూజిక్ గురించి మాటల్లో చెప్పలేను. డీఓపీ విష్ణు శర్మ నా రైట్ హ్యాండ్. సినిమా చూసిన తర్వాత ఆయన సినిమాటోగ్రఫీ గురించి మీరు ప్రత్యేకంగా రాస్తారు. అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది చాలా సీరియస్ ఫిలిం. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి మెసేజ్‌తో పాటు గొప్ప ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌ను తీసుకుని వస్తారు. అందరికీ థాంక్యూ సో మచ్.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఒక భక్తుడి బ్యాక్‌గ్రౌండ్‌లో సాగే థ్రిల్లర్. అదే సమయంలో ఇది ఒక ఎమోషనల్ రైడ్. అద్భుతమైన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను ఎక్స్‌ట్రార్డినరీగా తెరకెక్కించారు మా డైరెక్టర్ శివ నిర్వాణ. సినిమా అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో పనిచేసిన బేబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్, సాయికుమార్ గారు.. అందరూ అద్భుతంగా నటించారు. అలాగే మా టెక్నికల్ టీమ్ మొత్తం ఎక్స్‌ట్రార్డినరీ వర్క్ ఇచ్చారు. సినిమాలోని ప్రతి పాటా సూపర్‌హిట్ అయింది. రవితేజ గారు అంటేనే ఒక ఎనర్జీ. ఆయనతో మళ్లీ మళ్లీ పనిచేయాలని ఉంటుంది. మాస్, కామెడీ ఉండే ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉంది. అలాంటి కథ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాం. చాలా మంచి సినిమా తీశాం. ఆగస్టు 21న ‘ఇరుముడి’ని థియేటర్లలో చూసి ప్రేక్షకులు ఆస్వాదిస్తారని, సినిమాకు చాలా పెద్ద ఓపెనింగ్స్ వస్తాయని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ బాబీ కొల్లి మాట్లాడుతూ.. చిరంజీవి గారి సినిమా షూటింగ్‌లో ఉన్నాను. రవితేజ గారి ఫంక్షన్ అంటే పది నిమిషాల ముందే పంపించేశారు. రవితేజ గారు 2014లో ‘పవర్’ సినిమాతో నన్ను దర్శకుడిని చేశారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు నేను ఇక్కడికి వచ్చానంటే దానికి కారణం రవితేజ గారే. ప్రతి టెక్నీషియన్‌కి ఆయన అవకాశాలు ఇస్తూనే ఉంటారు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఇది రవితేజ గారితో తీయాల్సిన కథ అనిపించింది. శివ నిర్వాణ గారు అంత అద్భుతంగా తీశారు. మాలలో కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు. ఆగస్టు 21న మైత్రీ మూవీ మేకర్స్‌లో ‘ఇరుముడి’ చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది. రవితేజ గారితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌లోనే చేశాను. ఆ సమయంలో రవితేజ గారు ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ కథ నేను విన్నాను. శివ నిర్వాణ గారికి కంగ్రాట్యులేషన్స్. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఆగస్టు 21న ‘ఇరుముడి’తో థియేటర్లలో కుమ్మేద్దాం.
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ: ఇరుముడి నాకు చాలా స్పెషల్ ప్రాజెక్ట్. శివ నిర్వాణ గారు అద్భుతంగా తెరకెక్కించారు. చాలా బాధ్యతతో చేసిన సినిమా ఇది. అదే సమయంలో కమర్షియల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినిమాలో ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ అవుతుందని నమ్ముతున్నాను. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నేను రవితేజ గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఈ సినిమా ఆయన కెరీర్‌లో విక్రమార్కుడు కంటే కూడా మెమొరబుల్ మూవీ అవుతుంది. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇది. సినిమా బీజీఎం చేయడం కూడా చాలా స్పెషల్‌గా, ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇందులో యాక్షన్, సెంటిమెంట్, మాస్ మూమెంట్స్ ఇలా డిఫరెంట్ ఎమోషన్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్‌పీరియన్స్. థియేటర్లలో ప్రేక్షకులు కచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులోని పాటలను సూపర్‌హిట్ చేసినందుకు చాలా థాంక్స్. ‘మల్లెపూల పల్లకి’ పాటలో ఒక సర్‌ప్రైజ్ కూడా ఉంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ: ముందుగా మా డైరెక్టర్ శివ నిర్వాణ గారికి థాంక్యూ. నాకు కావేరి లాంటి గొప్ప పాత్రను ఇచ్చారు. ఆ పాత్రను నేను ఎప్పటికీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. జీవీ ప్రకాష్ గారితో మరో ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఈ సినిమా మొదటి నుంచే బ్లాక్‌బస్టర్ అవుతుందని చెబుతున్నారు. మొదటి నుంచి అదే ఎనర్జీతో ఉన్నారు. ఈ సినిమా గురించి మేమంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. రవితేజ గారితో కలిసి పనిచేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. నిర్మాతలు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.
బేబీ నక్షత్ర మాట్లాడుతూ.. ఇది తెలుగులో నాకు ఫస్ట్ సినిమా. ముఖ్యమైన పాత్ర పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది. రవితేజ గారు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే ప్రియా భవానీ శంకర్ గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌లో పనిచేయడం గొప్ప అవకాశం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ బుచ్చిబాబు సనా మాట్లాడుతూ: రవితేజ గారి సినిమాలు చూస్తూ స్ఫూర్తి పొంది ఇండస్ట్రీకి వచ్చాను. నేను రాసుకున్న మొదటి కథ కూడా ఆయన కోసమే రాసుకున్నాను. ఎప్పటికైనా ఆ కథను ఆయనకు చెప్పాలని ఉంది. ‘ఇరుముడి’ టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. నేను మైత్రీ మూవీ మేకర్స్‌లోనే పుట్టాను. ఈ బ్యానర్‌లో వచ్చే ప్రతి సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ ఎస్.కే.ఎన్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు మాస్ మహారాజా అభిమానిగా వచ్చాను. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి, రవితేజ గారు ఆ గెటప్‌లో కనిపించిన తర్వాత బ్లాక్‌బస్టర్ అనే ఇంప్రెషన్ క్రియేట్ అయింది. పిల్లలు, ఫ్యామిలీస్, జనాల్లోకి సినిమా పూర్తిగా వెళ్లిపోయింది. ఆగస్టు 21న సినిమాకు వచ్చే ఓపెనింగ్స్‌కు ఇదే నిదర్శనం. ఆగస్టు 21న అందరిదీ ఒకటే మాట—ఇరుముడి బ్లాక్‌బస్టర్. ఈ సినిమాలో కొన్ని సీన్లు చూశాను. అదిరిపోయాయి. గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ‘ఇరుముడి’ ఒక చరిత్ర సృష్టించే సినిమా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. రవితేజ గారికి ‘ఇరుముడి’ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది.
డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ: కలర్ ఫోటో సినిమా సమయంలో రవితేజ గారు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ‘బేబీ’ సినిమా విషయంలో ఆయన చేసిన ట్వీట్ మాకు ఎంతో హెల్ప్ అయ్యింది. ఇలాంటి మంచి కథలు తీసుకొస్తే తప్పకుండా ఆయన చేస్తారని శివ నిర్వాణ గారు మాకు నమ్మకాన్ని కల్పించారు. ఈ సినిమా అద్భుతంగా ఉండాలని, రవితేజ గారి నట విశ్వరూపం చూడాలని కోరుకుంటున్నాను. ‘ఇరుముడి’కి చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ మాట్లాడుతూ: శివ అండ్ టీమ్‌కి కంగ్రాట్యులేషన్స్. ఇలాంటి అందమైన పదాన్ని సినిమా టైటిల్‌గా పెట్టడం చాలా ఆసక్తికరంగా ఉంది. గ్లింప్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. కచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ట్రైలర్ అదిరిపోయింది. రవితేజ గారు, మైత్రీ మూవీ మేకర్స్ విజయాల పరంపరను ఈ సినిమాతో కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాను. జీవీ ప్రకాష్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రవితేజ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలను చూస్తూ స్ఫూర్తి పొందాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.
నటీనటులు: మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: విష్ణు శర్మ
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి
కో-డైరెక్టర్: సురేష్
మేకప్: శ్రీనివాస్ రాజు
కాస్ట్యూమర్ డిజైనర్: రాజేష్
పోస్టర్ డిజైనర్: ఎల్లో టూత్స్
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

