Skip to content

అనిల్ రావిపూడి చేతుల మీదుగా “అన్నగారు వస్తారు” టీజర్ రిలీజ్

అనిల్ రావిపూడి చేతుల మీదుగా “అన్నగారు వస్తారు” టీజర్ రిలీజ్ Telugu News

స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “వా వాతియార్” తెలుగు ప్రేక్షకుల ముందుకు “అన్నగారు వస్తారు” టైటిల్ తో రాబోతోంది. ఈ సినిమా డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “అన్నగారు వస్తారు” చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ రోజు మేకర్స్ ఈ చిత్ర టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ నెల 28న సాయంత్రం 5.04 నిమిషాలకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “అన్నగారు వస్తారు” సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా హీరో కార్తి నటిస్తున్న “అన్నగారు వస్తారు” సినిమా పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. కార్తి కెరీర్ లో ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ అవుతుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.

నటీనటులు – కార్తి, కృతి శెట్టి, సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————–
సినిమాటోగ్రఫీ – జార్జ్ సి. విలియమ్స్
ఎడిటింగ్ – వెట్రే కృష్ణన్
మ్యూజిక్ – సంతోష్ నారాయణన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – స్టూడియో గ్రీన్
నిర్మాత – కె. ఇ. జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం – నలన్ కుమారస్వామి

See also  AA22 x A6 ప్రీ లుక్‌తో హైప్ పెరిగింది

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.